ePaper
Friday, July 31, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్ఉత్సాహంగా అమరావతి అథ్లెటిక్స్ పోటీలు

ఉత్సాహంగా అమరావతి అథ్లెటిక్స్ పోటీలు

📰 Generate e-Paper Clip

సదుం గరుడ ధాత్రి జూలై31
సదంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో
రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించ తలపెట్టిన అమరావతి ఛాంపియన్షిప్ 2026 క్రీడలలో శుక్రవారం పుంగనూరు నియోజకవర్గ స్థాయిలో అథ్లెటిక్స్ పోటీలు నిర్వహించారు. మొత్తం 89మంది విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొనగా 42 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ప్రథమ స్థానం సాధించిన విద్యార్థులను జిల్లా స్థాయికి ఎంపిక చేస్తామని ప్రధానోపాధ్యాయుడు సుబ్రమణ్యం తెలిపారు. గత సంవత్సరం మొదటి స్థానం సాధించిన మహేంద్ర అనే విద్యార్థికి స్పోర్ట్స్ కిట్ 5000 రూపాయలు మరియు నేషనల్ పోటీలకు వెళ్ళుటకు 4000 రూపాయలు అందజేశారు. ఈ ఏడాది కూడా నేషనల్స్ కి వెళ్లే విద్యార్థులకు సహాయం చేస్తామని ఈ సందర్భంగా తెలిపారు.ఈ ఎంపికలో పీడీలు భాస్కర్, పుంగనూరు నియోజకవర్గ ఇన్చార్జి నౌషాద్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!