ఓటరు దేవుళ్ళను ప్రసనంలో నిమగ్నం అయిన రాజకీయ నాయకులు.
బైరెడ్డిపల్లి గరుడదాత్రి నవంబర్2
బైరెడ్డిపల్లి మండలం లో 16 ఎం పి టి.సి, స్థానాలు ఒక జడ్.పి.టి.సి. స్థానాలకు కేవలం 3 రోజుల్లో పోలింగ్ జరుగనుంది. ఈనేపథ్యంలో అభ్యర్థులు ఓటర్ల వద్దకు వెళ్లి విస్తృత ప్రచారం చేపడుతున్నారు.
నాయకులు ఓటర్లను ప్రసన్నం చేసుకోవడంలో ఫ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నారు. మండలంలో కూటమి పార్టీల అభ్యర్థులు విజయంకోసంమండల టి.డి.పి.అధ్యక్షుడు కిషోర్ గౌడు,పార్టీ ప్రధాన కార్యదర్శి సుబ్రమణ్యం శెట్టి విస్తృత ప్రచారం సాగుతోంది. వైకాపా అభ్యర్థులు తరపున మొగసాల సోదరులు కృష్ణమూర్తి,రెడెప్ప విస్తృత ప్రచారం చేస్తున్నారు. ఇప్పటికే టి.డి.పి.అభ్యర్థులు
,నాయకులు పొరుగు రాష్ట్రంలో నివసిస్తున్న మండల ఓటర్లను కలుసుకొని ఓట్లను అభ్యర్థించారు .నాయకులు ఎన్నడూ లేని విధంగా ఓటర్లు కుటుంబాల్లోఏ శుభ కార్యాలు జరిగిన హాజరై శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. మండలంలో ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకొని పార్టీ ల నాయకులు కు ఈ ఎన్నికలు అగ్నిపరీక్షగా నెలకొన్నది.అధికార పార్టీ నాయకుడు తన సతీమణి ను గెలిపించుకొని ఎం.పి.పి.గా చూడాలని గట్టి ప్రయత్నం చేస్తుండగా,ప్రతిపక్ష కీలక నాయకులు వారి కుటింభీకులు 4 స్థానాల్లో పోటీకి నిలబెట్టి వారి విజయం కోసం గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. రెండు ప్రధాన పార్టీలు వారి లక్ష్యాలు కోసం విస్తృత ప్రచారం చేస్తు మిగిలిన అభ్యర్థుల గెలుపు కు తీవ్రంగా కృషి చేస్తున్న ఓటర్లు ఈ ఎన్నికలలో ఎవరి లక్ష్యం నెరవేస్తారో పలితాలు వరకు వేచిచూడాల్సిందే.
