బైరెడ్డిపల్లి గరుడదాత్రి జూన్10
ప్రభుత్వ ఆదేశాల మేరకు 2026-27 విద్యా సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్ మోడల్ స్కూల్ కమ్మనపల్లి లో మిగిలి ఉన్న 6వ తరగతి, 7వ తరగతి, 8వ తరగతి, 9వ తరగతి మరియు ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ప్రవేశాల కోసం అర్హులైన విద్యార్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి.అని ప్రిన్సిపాల్ అనిత పేర్కొన్నారు.
దరఖాస్తుల స్వీకరణ 10-06-2026 నుండి 20-06-2026 వరకు జరుగుతుంది. 6వ తరగతి నుండి 9వ తరగతి వరకు ప్రవేశాల కోసం 24-06-2026న ప్రవేశ పరీక్ష నిర్వహించబడుతుంది. ఎంపికైన అభ్యర్థుల జాబితా 25-06-2026న ప్రకటించబడుతుంది. సర్టిఫికేట్ పరిశీలన మరియు ప్రవేశాలు 26-06-2026న నిర్వహించబడతాయి.
విద్యార్థులు తప్పనిసరిగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. మిగిలిన ఖాళీలను స్థానిక మరియు స్థానికేతర అభ్యర్థుల నుండి నిబంధనల ప్రకారం భర్తీ చేయబడును అన్నారు.అర్హులైన విద్యార్థులు
ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని వెంటనే దరఖాస్తు చేసుకోవాలని కోరడమైనది.
