తిరుపతి అక్టోబర్ 03 గరుడధాత్రి :
పార్టీ కార్యక్రమాలను, ప్రభుత్వ విధానాలను సామాజిక మాధ్యమాల ద్వారా ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లడంలో ప్రతిభ కనబరిచిన తిరుపతి అసెంబ్లీ ఐటీడీపీ అధ్యక్షుడు మునిచంద్రకు పార్టీ అధిష్ఠానం అందించిన రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌ను తుడా చైర్మన్ డాక్టర్ డాలర్స్ దివాకర్ రెడ్డి పరిశీలించి అభినందించారు.
తుడా చైర్మన్, టీటీడీ ఎక్స్‌అఫిషియో సభ్యుడు, టీడీపీ తిరుపతి పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ డాలర్స్ దివాకర్ రెడ్డిని తిరుపతి ఐటీడీపీ నాయకులు ఆదివారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పార్టీ నుంచి తనకు లభించిన రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌ను మునిచంద్ర ఆయనకు చూపించారు. బైక్‌ను పరిశీలించిన డాలర్స్ దివాకర్ రెడ్డి కొద్దిసేపు స్వయంగా టెస్ట్ డ్రైవ్ చేసి మునిచంద్రను మనస్ఫూర్తిగా అభినందించారు.
పార్టీ కోసం క్షేత్రస్థాయిలోనూ, డిజిటల్ వేదికలపైనా అంకితభావంతో పనిచేసే కార్యకర్తలను తెలుగుదేశం పార్టీ ఎల్లప్పుడూ గుర్తించి సముచితంగా గౌరవిస్తుందని డాలర్స్ దివాకర్ రెడ్డి అన్నారు. మునిచంద్రకు లభించిన ఈ గుర్తింపు ఆయన కష్టపడే తత్వానికి నిదర్శనమని పేర్కొన్నారు. యువత పార్టీ కార్యక్రమాల్లో మరింత చురుగ్గా పాల్గొని పార్టీని ముందుకు తీసుకెళ్లేందుకు ఇలాంటి ప్రోత్సాహకాలు స్ఫూర్తినిస్తాయని అన్నారు.
ఈ భేటీలో తిరుపతి పార్లమెంట్ ఐటీడీపీ ఇన్‌చార్జి యాచేంద్ర నాయుడు, తిరుపతి అసెంబ్లీ ఐటీడీపీ అధ్యక్షుడు మునిచంద్ర, ఉపాధ్యక్షుడు సుబ్రమణ్యం పాల్గొన్నారు.
