*గరుడ దాత్రి న్యూస్ జులై 27:-*
కడప జిల్లా ఆర్యవైశ్య ఉద్యోగుల సంఘం అధ్యక్షులుగా చైర్మన్గా నూతనంగా ఎన్నికైన సాదు వెంకటేశ్వర్లు గారికి పలువురు రాజకీయ ప్రముఖులు, సంఘాల నాయకులు మరియు అధికారులు హృదయపూర్వక అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయనను పలు కార్యక్రమాల్లో ఘనంగా సత్కరించారు.
నాయకులు ప్రముఖుల సన్మానం
రంగసముద్రం మాజీ సర్పంచ్ చిత్త రవి ప్రకాశ్ రెడ్డి, వైఎస్సార్సీపీ యువజన నాయకుడు చిత్త గిరిప్రణీత్ రెడ్డి, తులసి సురేష్ బాబు, విశ్వనాధుల జనార్దన్, కొత్త యోగేష్ తదితరులు సాదు వెంకటేశ్వర్లు గారిని కలిసి శాలువా కప్పి, మెమెంటో మరియు పుష్పగుచ్ఛం అందజేసి అభినందనలు తెలియజేశారు.
ఉద్యోగ ప్రతినిధుల సభ:
అలాగే, టీచర్స్ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్లు మరియు పద్మావతి కళ్యాణ మండపం యజమాని నాగేశ్వరరెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రత్యేక అభినందన సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్లు, నాగేశ్వరరెడ్డి మరియు ఇతరులు పాల్గొని సాదు వెంకటేశ్వర్లు గారిని శాలువాలు, పుష్పగుచ్ఛాలతో ఘనంగా సత్కరించారు.
సంఘం మరింత ప్రగతి సాధించాలి:
ఈ సందర్భంగా మాట్లాడిన పలువురు వక్తలు — సాదు వెంకటేశ్వర్లు గారు తన నూతన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ, కడప జిల్లా ఆర్యవైశ్య ఉద్యోగుల సంఘం అభివృద్ధికి మరియు సభ్యుల సంక్షేమానికి విశేషంగా కృషి చేయాలని ఆకాంక్షించారు. ఆయన నాయకత్వంలో సంఘం మరింత ఉన్నత స్థాయికి చేరుకుని అందరికీ ఆదర్శంగా నిలవాలని శుభాకాంక్షలు తెలిపారు.
కడప జిల్లా ఆర్యవైశ్య ఉద్యోగుల సంఘం అధ్యక్షులుగా సాదు వెంకటేశ్వర్లు వెల్లువెత్తుతున్న అభినందనలు ఘన సన్మానం
RELATED ARTICLES
