కాణిపాకం, ఆగస్టు 9 (గరుడధాత్రి న్యూస్):
కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి దేవస్థానానికి బెంగళూరుకు చెందిన దీపికారాణి కుటుంబ సభ్యులు రూ.1.10 లక్షల విరాళాన్ని అందజేశారు.
దేవస్థానం నిత్య అన్నదాన ట్రస్టుకు రూ.59,999, గో సంరక్షణ ట్రస్టుకు రూ.50,001 చొప్పున మొత్తం రూ.1,10,000 విరాళంగా సమర్పించారు.
ఈ సందర్భంగా దీపికారాణి కుటుంబ సభ్యులకు ఆలయ అధికారులు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. కార్యక్రమంలో టెంపుల్ ఇన్స్పెక్టర్ బాలాజీ నాయుడు తదితరులు పాల్గొన్నారు.
కాణిపాకం నిత్య అన్నదాన, గో సంరక్షణ ట్రస్టులకు రూ.1.10 లక్షల విరాళం
RELATED ARTICLES
