నారాయణవనం జూన్ 15 (గరుడధాత్రి న్యూస్ ) మండలంలోని వెత్తల తడుకు పంచాయతీలోని కీలగరం లేఅవుట్ను సోమవారం సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం ఉన్నతాధికారులతో కలిసి పరిశీలించారు. అక్కడ నివసిస్తున్న ప్రజలు లేఅవుట్ లోని సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. ఎమ్మెల్యే స్పందిస్తూ ఇక్కడ రోడ్డు సమస్యను విద్యుత్తు లైట్లసమస్యను మురికి కాలువల నిర్మాణం వంటి అభివృద్ధి పనులకు అధికారులు సహకరించాలని కోరారు. ఉన్నత అధికారుల దృష్టికి పైసమస్యలను తీసుకెళ్లి న్యాయం చేస్తామని ఎంపీడీవో ఎమ్మార్వోలు హామీ ఇచ్చారు.
