* 32 వార్డులలో మొత్తం 40,203 ఓటర్లు.
* సందర్శనార్థం సచివాలయాల్లో ఓటర్ల జాబితా.
* వివరాలు వెల్లడించిన పురపాలక సంఘం కమిషనర్ వి. శ్రీనివాసరావు.
కుప్పం,సెప్టెంబర్ 03 (గరుడ ధాత్రి న్యూస్): కుప్పం పురపాలక సంఘం పరిధిలో 32 వార్డులకు గాను ఓటర్ల జాబితాను ప్రచురించారు. గురువారం కుప్పం పురపాలక సంఘం కార్యాలయంలో కమిషనర్ వి. శ్రీనివాసరావు జాబితాను ప్రచురించారు. ఓటర్ల జాబితాను ప్రజలు చూసేందుకు గాను సచివాలయాల్లో ఉంచుతున్నారు. గతంలో 25 వార్డులుగా కుప్పం పురపాలక సంఘం ఉండేది. ప్రస్తుతం కుప్పం పురపాలక సంఘం పరిధిని 32 వార్డులుగా విభజించారు. త్వరలో జరగబోయే పురపాలక సంఘం ఎన్నికలలో 32 వార్డులకు గాను ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు స్థానిక ఎన్నికల ప్రక్రియ లో భాగంగా ఓటర్ల జాబితాను ప్రచురించారు. కుప్పం పురపాలక సంఘం పరిధిలో మొత్తం 32 వార్డులలోను 40,203 ఓటర్లు ఉన్నారు. అందులో పురుష ఓటర్లు19,237 మంది ఉన్నారు.20,958 మహిళా ఓటర్లు ఉన్నారు. ఇతరులు 8 మంది ఉన్నారు. ఒకటవ వార్డులో 1,138 మంది ఓటర్లు ఉన్నారు. 2 వ వార్డులో1,471 ఓటర్లు, 3 వవార్డులో1,036 ఓటర్లు,4 వ వార్డులో1,492 ఓటర్లు,5 వ వార్డులో 1,071 ఓటర్లు ఉన్నారు.6వ వార్డులో1,070 ఓట్లు,7 వార్డులో1,315 ఓట్లు, 8వ వార్డులో1,062 ఓట్లు,9 వాటిలో1,053 ఓట్లు,10 వార్డులో1,399 ఓట్లు,11 వార్డులో 1,141 ఓట్లు,12 వార్డులో 1,099 ఓట్లు,13 వార్డ్ లో 1,197 ఓట్లు,14 వార్డులో 1,181 ఓట్లు,15 వార్డ్ లో1,213 ఓట్లు, ఉన్నాయి.16వార్డులో 1,232 ఓట్లు,17వార్డులో 1,017 ఓట్లు,18 వార్డులో 1,106 ఓట్లు,19 వార్డులో 1,164 ఓట్లు,20 వార్డులో 1,209 ఓట్లు ఉన్నాయి.21 వార్డులో 1,337 ఓట్లు,22 వార్డులో 1,461 ఓట్లు,23 వార్డులో 1,494 ఓట్లు,24 వార్డులో 1,443 ఓట్లు,25వార్డులో 1,470 ఓట్లు ఉన్నాయి.26 వ వార్డులో 1,437 ఓట్లు,27 వ వార్డ్ లో1,362 ఓట్లు,28 వ వార్డు లో 1,490 ఓట్లు,29 వ వార్డులో 1,378 ఓట్లు,30 వార్డులో 1,378 ఓట్లు,31 వ వార్డులో1,088 ఓట్లు,32 వ వార్డులో 1,199 ఓట్లు ఉన్నాయి.
కుప్పం పురపాలక పరిధిలో 32 వార్డుల ఓటర్ల జాబితా ప్రచురణ.
RELATED ARTICLES
