బైరెడ్డిపల్లి గరుడదాత్రి అక్టోబర్26
పరాభవ నామ సంవత్సరం ఆస్విజ శుద్ధ పౌర్ణమి సందర్భంగా సోమవారం మండలం లోని కుప్పనపల్లె వద్ద వెలసిన శ్రీ కాలభైరవ స్వామి దేవస్థానము నందు మూలవర్లకు అర్చకులు మురళీధర్ ఆచార్యులు నిర్మాల్యపూజ,శుద్ధి పుణ్యా వచనం జరిపి పంచ ఫలాలతో పంచామృత అభిషేకములు జరిపి వివిధ రకాల సుగంధ పుష్పాలతో సుందరంగా అలంకరించి స్వామివారికి ధూప దీప, నైవేద్యములు, మంగళ హారతులు జరిపి భక్తులకు తీర్థ ప్రసాదాలు పంచారు. కార్యక్రమమునకు లక్ష్మీనారాయణ రాజేంద్రప్రసాద్ దేవరాజులు బాలరాజు గోపి వెంకటరమణ కృష్ణప్ప ఉబయదారులుగా వివరించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
