బైరెడ్డిపల్లి గరుడదాత్రి అక్టోబర్26
బి-ఫారాలు, అభ్యర్థిత్వ ఉపసంహరణలకు అక్టోబర్ 27 మధ్యాహ్నం 3 గంటల వరకు గడువు ఉన్నపటికీ సోమవారం 21 మంది ఉపసంహరణ చేసుకున్నారని రిటర్నింగ్ అధికారి ఎన్. వెంకటరాముడు, సహాయ రిటర్నింగ్ అధికారి మరియు ఎంపీడీఓ కె. ఆనందబాబు తెలిపారు.
బైరెడ్డిపల్లి మండలం లోని చప్పిడిపల్లి నుంచి నలుగురు, ధర్మపురి నుంచి ముగ్గురు, గొల్లచీమనపల్లి, నెల్లిపట్ల, వెంగంవారిపల్లి నుంచి ఇద్దరు చొప్పున, బైరెడ్డిపల్లి–I, బేలుపల్లి, దేవదొడ్డి, కడపనత్తం, కమ్మనపల్లి, లక్కనపల్లి, పాతపేట, తీర్థం నుంచి ఒక్కొక్కరు ఉపసంహరించుకున్నారు. అక్టోబర్ 25న ఉపసంహరించుకున్న 11 మందితో కలిపి అక్టోబర్ 26 నాటికి మొత్తం ఉపసంహరణలు 32కు చేరాయి. ప్రస్తుతం 50 మంది అభ్యర్థులు మిగిలారు అని వారు పేర్కొన్నారు.
బి-ఫారాలు, అభ్యర్థిత్వ ఉపసంహరణ పత్రాలను 27-10-2026 మంగళవారం మధ్యాహ్నం 3 గంటలలోపు బైరెడ్డిపల్లి మండల పరిషత్ కార్యాలయంలోని రిటర్నింగ్ అధికారికి సమర్పించాలి. నిర్దేశిత గడువు దాటిన తర్వాత పత్రాలు స్వీకరించబడవని స్పష్టం చేశారు.
అక్టోబర్ 27న మధ్యాహ్నం 3 గంటల తర్వాత, ఉపసంహరణల ప్రక్రియ ముగిసిన అనంతరం, నిబంధనల ప్రకారం పోటీలో మిగిలిన అభ్యర్థులకు ఎన్నికల గుర్తులు కేటాయించి, గుర్తులతో కూడిన తుది పోటీ అభ్యర్థుల జాబితాను ప్రచురిస్తామని తెలిపారు.
