బైరెడ్డిపల్లి, సెప్టెంబర్ 13 గరుడదాత్రి :
బైరెడ్డిపల్లి గ్రామ పంచాయతీ మాజీ సర్పంచ్ కొమ్ము వెంకటేష్ అన్న కొమ్ము మునస్వామి అనారోగ్యంతో ఆదివారం మృతి చెందారు. విషయం తెలుసుకున్న వైసీపీ రాష్ట్ర కార్యదర్శి మొగసాల కృష్ణమూర్తి, బైరెడ్డిపల్లి మండల ఎంపీపీ మొగసాల రెడ్డెప్ప మృతుడి భౌతికకాయాన్ని సందర్శించి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
అనంతరం మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించి, ఆర్థిక సహాయం అందించారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేసి, మునస్వామి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.
ఈ కార్యక్రమంలో చిత్తూరు జిల్లా వైసీపీ యువజన విభాగ కార్యదర్శులు మొగసాల రాజు, మొగసాల శైలేష్‌తో పాటు వైసీపీ కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.
కొమ్ము మునస్వామి మృతికి వైసీపీ నేతల నివాళులు
RELATED ARTICLES
