ePaper
Monday, September 14, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్భక్తి ప్రపత్తులతో శ్రీ గంగమ్మ ఆలయ నిర్మాణానికి భూమిపూజ

భక్తి ప్రపత్తులతో శ్రీ గంగమ్మ ఆలయ నిర్మాణానికి భూమిపూజ

📰 Generate e-Paper Clip

పిచ్చాటూరు, సెప్టెంబర్ 13 గరుడధాత్రి :
పిచ్చాటూరు గ్రామదేవత శ్రీ గంగమ్మ తల్లి నూతన ఆలయ నిర్మాణానికి ఆదివారం ఉదయం గ్రామ పెద్దలు, ప్రజల సమక్షంలో భక్తి ప్రపత్తులతో భూమిపూజ కార్యక్రమం నిర్వహించారు. ఉదయం 8.30 గంటలకు ప్రారంభమైన భూమిపూజ క్రతువును ఆలయ సంప్రదాయాలకు అనుగుణంగా వేదోక్తంగా నిర్వహించారు.
చిరకాలంగా గ్రామదేవతగా కొలువై ఉన్న శ్రీ గంగమ్మ తల్లి నూతన ఆలయ నిర్మాణానికి తమ చేతుల మీదుగా భూమిపూజ చేయడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నామని మాజీ సర్పంచ్ కేజీ రోస్ రెడ్డి, గ్రామ పెద్దలు తెలిపారు.
నూతన ఆలయ నిర్మాణ పనులు త్వరగా పూర్తై, గంగమ్మ తల్లి కుంభాభిషేక మహోత్సవం ఘనంగా జరిగేలా అమ్మవారి ఆశీస్సులు ఉండాలని వారు ఆకాంక్షించారు. అలాగే గ్రామ ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో జీవించేలా గంగమ్మ తల్లి కటాక్షించాలని ప్రార్థించారు.
ఆలయ నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేసేందుకు గ్రామ పెద్దలు, ప్రజలు తమ సంపూర్ణ సహాయ సహకారాలు అందించాలని మాజీ సర్పంచ్ కేజీ రోస్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, భక్తులు, ప్రజలు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!