ePaper
Wednesday, July 29, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్ఘనంగా ‘రెండేళ్ల నమ్మకం, అభివృద్ధి, సంక్షేమం’ కార్యక్రమం

ఘనంగా ‘రెండేళ్ల నమ్మకం, అభివృద్ధి, సంక్షేమం’ కార్యక్రమం

📰 Generate e-Paper Clip

కార్వేటినగరం జూలై 28 (గరుడదాద్రి న్యూస్): కార్వేటినగరం మండలం సురేంద్రనగరం, కేయం పురం, కొటారివేడు, కనికాపురం పంచాయతీలలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భాన్ని పురస్కరించుకుని ‘రెండేళ్ల నమ్మకం – అభివృద్ధి, సంక్షేమం’ పేరుతో ఇంటింటి ప్రచార కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మండల పార్టీ అధ్యక్షులు చెంగల్రాయ యాదవ్, మండల ప్రధాన కార్యదర్శి వడియం గాడు రాజా మాట్లాడుతూ మన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయ్యిందని, ఎన్నికల ముందు ఇచ్చిన ప్రతీ హామీని దాదాపు నెరవేర్చి ప్రజలు తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకున్నామని హర్షం వ్యక్తం చేశారు. ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ ఫలాలను వివరించేందుకే నేరుగా ప్రజల వద్దకు వస్తున్నామని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు గారు చెప్పినట్లే ప్రతి నెలా 1వ తేదీనే లబ్ధిదారుల ఇంటి వద్దే రూ.4 వేల పెన్షన్ అందజేస్తున్నారని వివరించారు. ‘తల్లికి వందనం’ కింద బడికి వెళ్లే ప్రతి బిడ్డకు రూ.15 వేలు అందించడమే కాకుండా, ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని రకాల మౌలిక వసతులు కల్పించి అద్భుతంగా తీర్చిదిద్దుతున్నామని చెప్పారు. వీటితో పాటు ‘అన్నదాత సుఖీభవ’ కింద రైతులకు ఎకరాకు రూ.20 వేలు, ‘మత్స్యకార భరోసా’ కింద రూ.20 వేలు, ‘స్త్రీ శక్తి’ ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ‘ఆటో సేవ’ కింద డ్రైవర్లకు రూ.15 వేల ఆర్థిక సాయం అందించామన్నారు. పేదల ఆకలి తీర్చే అన్నా క్యాంటీన్లను పునఃప్రారంభించడంతో పాటు, ఆక్వా రైతులకు విద్యుత్తు ఛార్జీల భారం పడకుండా చర్యలు తీసుకున్నామని, రైతుల భూ సమస్యలు పరిష్కరించి రాజముద్రతో కొత్త పాసు పుస్తకాలు అందిస్తున్నామని వెల్లడించారు. కోవూరు నియోజకవర్గంలోనూ ప్రభుత్వ సహకారంతో అన్ని ప్రాంతా�

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!