ePaper
Wednesday, July 29, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్సేవాస్ఫూర్తి చాటిన కుప్పం ఇంజనీరింగ్ కళాశాల ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు

సేవాస్ఫూర్తి చాటిన కుప్పం ఇంజనీరింగ్ కళాశాల ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు

📰 Generate e-Paper Clip

కుప్పం,జులై 28 (గరుడ ధాత్రి న్యూస్):

కుప్పం ఏరియా ఆసుపత్రిలో తెలుగునాడు స్టూడెంట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన స్వచ్ఛంద రక్తదాన శిబిరంలో కుప్పం ఇంజనీరింగ్ కళాశాల ఎన్ ఎస్ ఎస్ విభాగం ఆధ్వర్యంలోని వాలంటీర్లు ఉత్సాహంగా పాల్గొని రక్తదానం చేసి తమ సేవాస్ఫూర్తిని చాటారు. సమాజానికి అవసరమైన సమయంలో రక్తాన్ని అందించి ప్రాణాలను కాపాడాలనే మహోన్నత సంకల్పంతో విద్యార్థులు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ రక్తదాన శిబిరాన్ని ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి ప్రారంభించారు.
శిబిరంలో కుప్పం ఇంజనీరింగ్ కళాశాల విద్యార్ధులు, అధ్యాపకులు స్వచ్ఛందంగా పాల్గొని మొత్తం 34 యూనిట్ల రక్తాన్ని దానం చేసి మానవత్వానికి తమ వంతు సేవను అందించారు. యువతలో సామాజిక బాధ్యత, సేవాభావం మరియు మానవతా దృక్పథాన్ని పెంపొందించడంలో ఇటువంటి కార్యక్రమాలు కీలక పాత్ర పోషిస్తాయని పలువురు అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో కుప్పం మున్సిపల్ చైర్మన్ సిల్వరాజ్, మాజీ మున్సిపల్ చైర్మస్ డా. సుధీర్, మాజీ ఎంపీపీ డా. వెంకటేష్ ముఖ్య అతిథులుగా పాల్గొని రక్తదాతలను అభినందించారు. రక్తదానం ద్వారా అనేక మంది ప్రాణాలను కాపాడవచ్చని, ప్రతి యువకుడు సామాజిక బాధ్యతగా స్వచ్ఛంద రక్తదానాన్ని అలవాటు చేసుకోవాలని వారు పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో కుప్పం ఇంజనీరింగ్ కళాశాల హ్యూమానిటీస్ అండ్ సైన్సెస్ విభాగాధిపతి జె. మాధవస్ గారు, ఎన్ ఎస్ ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ గంగాధరన్, కోఆర్డినేటర్ డా. అరుణ్ కుమార్ , పీఆర్వో ప్రవీణ్ కుమార్ , అధ్యాపకులు, విద్యార్థులు, ఎన్ ఎస్ ఎస్ వాలంటీర్లు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!