ePaper
Friday, October 9, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతిచరిత్రలో చిరస్థాయిగా ప్రధాని నరేంద్ర మోడీ ప్రస్థానం

చరిత్రలో చిరస్థాయిగా ప్రధాని నరేంద్ర మోడీ ప్రస్థానం

📰 Generate e-Paper Clip

* కుప్పం రూరల్ బిజెపి అధ్యక్షులు వడి వేలు.
కుప్పం, అక్టోబర్ 08 (గరుడ ధాత్రి న్యూస్): ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 25 ఏళ్ల రాజకీయ ప్రస్థానం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని కుప్పం రూరల్ భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు వడివేలు అన్నారు. శుక్రవారం ఆయన స్థానిక గరుడ ధాత్రి విలేకరితో మాట్లాడారు. ప్రభుత్వాధినేతగా 25 ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానాన్ని పూర్తి చేసుకుంటూ, మైలురాయిని చేరుకున్నారన్నారు. అత్యంత నిష్టతో, అంకితభావంతో దేశానికి సేవ చేస్తూ ముందుకు వెళ్తున్నారన్నారు. వికసిత భారత 2047 లక్ష్యంతో ముందుకు పోతున్నారన్నారు. 2001 అక్టోబర్ 7న నరేంద్ర మోడీ తొలిసారిగా గుజరాత్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారన్నారు. ఆ తర్వాత గుజరాత్లో మూడుసార్లు ప్రజల నుంచి తిరుగులేని మెజారిటీ సాధించి, అక్కడి నుంచి 2014 సార్వత్రిక ఎన్నికల్లో బిజెపిని చారిత్రాత్మక విజయపథంలో నడిపించారన్నారు. నాటి నుంచి నేటి వరకు వరుసగా మూడుసార్లు భారత ప్రధానమంత్రిగా గెలిచి, బాధ్యతలు నిర్వర్తిస్తున్నారన్నారు.భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన 100 సంవత్సరాలు పూర్తయ్యే నాటికి (2047 నాటికి) దేశాన్ని ఒక అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలనే లక్ష్యంతో కార్యక్రమాలను ముందుకు తీసుకుపోతున్నారన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!