ePaper
Thursday, August 13, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్చౌడేపల్లిలో వరిగడ్డి వాము దగ్ధం: ₹50 వేల నష్టం

చౌడేపల్లిలో వరిగడ్డి వాము దగ్ధం: ₹50 వేల నష్టం

📰 Generate e-Paper Clip

చౌడేపల్లి ఆగస్టు 12 గరుడ దాత్రి న్యూస్

చౌడేపల్లి మండలం భతలాపురం రోడ్డులో ప్రమాదవశాత్తు వరిగడ్డి వాము అగ్నిప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో సుమారు రూ 50వేలు రూపాయల ఆస్తి నష్టం వాటిల్లినట్లు బాధితుడు తెలిపారు.
బాధితుడు ఎస్. సయ్యద్ బాషాకి చెందిన వరిగడ్డి వాముకు మంటలు అంటుకున్నట్లు పుంగనూరు అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందింది. సమాచారం అందుకున్న వెంటనే ఇన్చార్జి కేంద్రాధికారి కే. సురేష్ బాబు ఆధ్వర్యంలో అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. వాటర్ ట్యాంకర్ సహాయంతో మంటలను పూర్తిగా అదుపు చేసి ఆర్పేశారు.
గుర్తుతెలియని వ్యక్తులు ఎవరైనా బీడీ లేదా సిగరెట్ తాగి ఆర్పకుండా పడేయడం వల్లే ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని భావిస్తున్నారు. ఈ ఆర్పే చర్యల్లో ఫైర్ సిబ్బంది ఈ. సుబ్రమణ్యం, ఎమ్. లోకేష్ రెడ్డి, వి. కేశవ, కే. మోహన్ బాబులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!