ePaper
Saturday, September 12, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్చౌడేపల్లిలో వైభవంగా కృష్ణాష్టమి వేడుకలు

చౌడేపల్లిలో వైభవంగా కృష్ణాష్టమి వేడుకలు

📰 Generate e-Paper Clip

చౌడేపల్లి సెప్టెంబర్ 04 గరుడ దాత్రి న్యూస్

చౌడేపల్లి మండలంలో శ్రీకృష్ణ జన్మాష్టమి పర్వదినాన్ని భక్తులు అత్యంత వైభవంగా, భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. మండలవ్యాప్తంగా ఆధ్యాత్మిక వాతావరణం నెలకొనగా, ఆలయాలన్నీ కృష్ణుడి నామస్మరణతో మారుమోగాయి.
చౌడేపల్లి పట్టణంలోని శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాలస్వామి ఆలయంలో వేడుకలు కోలాహలంగా సాగాయి. ఆలయ ప్రధాన అర్చకుడు వశిష్టాచార్యులు ఆధ్వర్యంలోఉదయాన్నే స్వామివార్లకు శాస్త్రోక్తంగా అభిషేకాలు నిర్వహించి, కన్నులపండువగా విశేష అలంకరణ చేశారు. ఉదయం నుంచే స్వామివారి దర్శనం కోసం భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివచ్చారు. సాయంత్రం వరకు ఆలయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడింది. పట్టణంతో పాటు అగ్రహారంలోని వేణుగోపాలస్వామి ఆలయంలో పలు ప్రత్యేక పూజా కార్యక్రమాలు కన్నులపండువగా నిర్వహించారు. ఆలయానికి విచ్చేసిన భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా నిర్వాహకులు దర్శన ఏర్పాట్లు చేయడంతో పాటు పవిత్ర తీర్థప్రసాదాలను అందజేశారు.
మండలప్రజలు ఉత్సాహంగా పాల్గొనడంతో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఆధ్యాత్మిక శోభతో దిగ్విజయంగా పూర్తయ్యాయి. ఉభయదారులుశ్రీరామ జగదీష్ కుటుంబ సభ్యులు గా వ్యవహరించారు

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!