చౌడేపల్లి ఆగస్టు 07 గరుడ దాత్రి న్యూస్
మండల కేంద్రమైన చౌడేపల్లి లో ఆడి కృత్తిక వైభవంగా జరిగినది. ఉదయం 6 గంటలకు అభిషేకము అనంతరం అలంకరణ గావించారు స్థానికం రాజశేఖర్ దీక్షితులు మరియు మహేష్ దీక్షితులు, కుమారస్వామి. మంత్రోక్షణలతో మంగళ వాయిద్యాల నడుమున శ్రీ వల్లి దేవ సేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామి పూజా కార్యక్రమము వైభవంగా జరిగినది వచ్చిన భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు చౌడేపల్లి ప్రజలే కాకుండా చుట్టూ ప్రక్కల మండలాల నుంచి తరలివచ్చిన భక్త జనులకు ఏ ఇబ్బంది కలగకుండా దేవాదాయ ధర్మాదాయ శాఖ వారు పర్యవేక్షణ చేశారు ఉదయం 9 గంటల నుంచి పుష్ప కావెళ్ళు చెల్లించడం జరిగినది. రాత్రి 9 గంటలకు నెమలి వాహనంపై వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఊరేగింపు కన్నులు విందుగా చూడ ముచ్చటగా వైభవముగా జరిగినది. సుబ్రహ్మణ్యస్వామి ఊరేగింపుకు దాతలు బెల్లాల శ్రీనివాసులు మరియు బ్రదర్స్ నిర్వహించారు
