పిచ్చాటూరు జూలై24 గరుడధాత్రి న్యూస్ :
మంగళవారం ఉదయం తిరుపతిలో గౌరవ జిల్లా ఇన్‌చార్జి మంత్రి వర్యులు అనగాని సత్య ప్రసాద్ ను సత్యవేడు శాసనసభ్యులు కోనేటి ఆదిమూలం మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా నియోజకవర్గ అభివృద్ధి, ప్రజా సమస్యలు, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు తదితర అంశాలపై చర్చించినట్లు సమాచారం. అలాగే సత్యవేడు నియోజకవర్గంలో చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి మంత్రివర్యులకు ఎమ్మెల్యే వివరాలు తెలియజేశారు.
ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు మరింత చేరువ చేయడంలో సమన్వయంతో ముందుకు సాగాలని ఈ సందర్భంగా నేతలు అభిప్రాయపడ్డారు.
