ePaper
Thursday, June 25, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్రేషన్ డీలర్లు గైర్హాజరుపై తహసీల్దార్ ఆగ్రహం

రేషన్ డీలర్లు గైర్హాజరుపై తహసీల్దార్ ఆగ్రహం

📰 Generate e-Paper Clip

-సమావేశానికి 13 మంది డీలర్లు డుమ్మా.. చర్యలు తప్పవు

పిచ్చాటూరు జూన్ 24 గరుడధాత్రి న్యూస్ :
పిచ్చాటూరు మండల తహసీల్దార్ వై. చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో బుధవారం డీలర్ల సమావేశం నిర్వహించారు. అయితే ఈ సమావేశానికి 13 మంది డీలర్లు గైర్హాజరుకావడంపై తహసీల్దార్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఇకపై ప్రతి నెల 24వ తేదీన డీలర్ల సమావేశం తప్పనిసరిగా నిర్వహించబడుతుందని, సమావేశాలకు హాజరుకాని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. డీలర్లు ప్రజలకు అందుబాటులో ఉండాలని, స్థానికంగా నివాసం ఉంటూ రేషన్ పంపిణీ వ్యవస్థను సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు.
ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని, అర్హులైన లబ్ధిదారులకు న్యాయం జరగాలని తెలిపారు. రేషన్ పంపిణీలో నిర్లక్ష్యం, అవకతవకలు లేదా ప్రజలకు అన్యాయం జరిగితే ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని తహసీల్దార్ వై. చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!