*హెల్మెట్ ధరించి, పరిమితికి మించి ప్రయాణించవద్దు: ఎస్ఐ శివశంకర్రావు
*గరుడ దాత్రి నాయుడుపేట ఆగస్టు 21
వాహనదారులందరూ ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని నాయుడుపేట పట్టణ ఎస్ఐ ఎం. శివశంకర్రావు సూచించారు.శుక్రవారం పట్టణంలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహం వద్ద ట్రాఫిక్ పరిస్థితిని పరిశీలించారు. ఈ సందర్భంగా ద్విచక్ర వాహనంపై ఐదుగురు కుటుంబ సభ్యులు ప్రమాదకరంగా ప్రయాణిస్తున్న విషయాన్ని గుర్తించిన ఎస్ఐ వాహనాన్ని ఆపి కౌన్సెలింగ్ ఇచ్చారు. పరిమితికి మించి ప్రయాణించడం ప్రమాదకరమని, కుటుంబ సభ్యుల భద్రతపై వాహనదారులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు.వాహనం నడిపే సమయంలో తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, వాహన రిజిస్ట్రేషన్ పత్రాలు, డ్రైవింగ్ లైసెన్స్ వెంట ఉంచుకోవాలని తెలిపారు. మొదటి తప్పుగా పరిగణించి హెచ్చరికతో వారిని పంపించారు. ఇకపై నిబంధనలు ఉల్లంఘించి ప్రమాదకరంగా ప్రయాణిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్ఐ శివశంకర్రావు హెచ్చరించారు.
