*డీఎస్సీకి, ఏపీపీఎస్సీకి తేడా తెలియకుండా మాట్లాడడం హాస్యాస్పదం*
*రాజకీయ లబ్ది కోసమే డీఎస్సీ డ్రామా : ఎమ్మెల్యే అమర్*
*బైరెడ్డిపల్లి మండల ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో పలు ప్రారంభోత్సవాలు*
బైరెడ్డిపల్లి గరుడదాత్రి సెప్టెంబర్4
డీఎస్సీ అంశంలో దొంగే దొంగ అన్నట్టు జగన్ వ్యవహార శైలి ఉందని పలమనేర్ శాసనసభ్యుల అమరనాథ రెడ్డి విమర్శించారు. బైరెడ్డిపల్లి మండలంలోని కంభంపల్లి, గడ్డురు, దేవదొడ్డి,,తీర్థం, గంగినేపల్లి పంచాయతీల పరిధిలోని గ్రామాలలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో భాగంగా మూడవరోజు శుక్రవారం ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా తీర్థం గ్రామంలో డీఎస్సీ ద్వారా ఉద్యోగాలు పొందిన అభ్యర్థులు ఆయన్ను కలిసి సన్మానించారు.ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు డీఎస్సీ ని నిర్వహించి చంద్రబాబు మరియు లోకేష్ లు మాట నిలబెట్టుకున్నారని కుటుంబ ప్రభుత్వానికి జీవితాంతం రుణపడి ఉంటామని వారు ఈ సందర్భంగా పేర్కొన్నారు.
పేద వర్గాల నుంచి వచ్చిన తాము కష్టపడి చదివి జాబ్ లు సాధించుకున్నామని, అయితే సునాయాసంగా జాబులు సాధించామని వైకాపా అధినేతతో పాటు అ పార్టీ నేతలు చేసిన వ్యాఖ్యలకు తీవ్ర ఆందోళన చెందుతున్నట్లు వారు ఆయన ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై స్పందించి ఆయన ఏపీపీఎస్సీకి, డీఎస్సీకి కూడా తేడా తెలియకుండా జగన్ రెడ్డి మాట్లాడడం హాస్యాస్పదమన్నారు. తమ హయాంలో తప్పులు చేసినట్టే ఇప్పుడు జరిగిందనుకోవడం అవివేకమన్నారు. కేవలం రాజకీయ లబ్ధి పొందడానికే డీఎస్సీ వ్యవహారంలో గందరగోళానికి తెర లేపారని పేర్కొన్నారు. డీఎస్సీ అంశంపై అవగాహన లేని వ్యక్తులు చేసిన వ్యాఖ్యలను ఏమాత్రం పట్టించుకోవద్దని అలాంటి వ్యక్తులను ప్రజలు నమ్మడం పూర్తిగా వ్యర్థమని విమర్శించారు.
*ఎమ్మెల్యే చేతుల మీదుగా పలు ప్రారంభోత్సవాలు*
దాసార్లపల్లి గ్రామంలో 11.40 లక్షలతో నిర్మించిన సిసి రోడ్డును, విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ను ప్రారంభించారు…
కోటిరేపల్లి గ్రామం నందు రూ.6. 55 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్డును ప్రారంభించారు…
దేవ దొడ్డి గ్రామం నందు రూ. 14 లక్షలుతో నిర్మించిన విలేజ్ హెల్త్ క్లినిక్ ప్రారంభించారు…
తీర్థం సబ్ స్టేషన్ నందు రూ. 1.08 కోట్లతో 13 గ్రామాల ప్రజల సౌకర్యర్థం 5000కేవి పవర్ ట్రాన్స్ ఫార్మర్ ను మరియు గ్రామం నందు రూ.14.40 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్డును ఆయన ప్రారంభించారు….
అదేవిధంగా పసలమంద మిట్ట నందు రూ.15 లక్షలతో వ్యయంతో ఏర్పాటు చేసిన బోరు మోటారు ప్రారంభం….
గంగినేపల్లి పంచాయతీ కొత్త ఇండ్లు నందు సుమారు రూ.10 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్డును, మరియు రూ. 25 లక్షలతో సీసి రోడ్లకు భూమి పూజా చేపట్టారు…
కామినేపల్లి నందు రూ. 20 లక్షలతో నిర్మంచిన సిసి రోడ్డును, రూ.5 లక్షల తో ఏర్పాటు చేసిన పైపులైన్ ప్రారంభించారు….
*ఎమ్మెల్యే పర్యటించిన గ్రామాలు*…
కంభంపల్లి, రామాపురం, జంబుగుండ్లపల్లి, దాసార్లపల్లి,గడ్డురు, కోట్రేపల్లి, కొత్తూరు, కార్వేటి రామనగరం, దేవదొడ్డి , కామినేపల్లి,,కూటాల వంక గుంతకురపల్లి, తీర్థం,కైగల్ గంగినేపల్లి,కొత్తిండ్లు గ్రామాలలో ఆయన పర్యటన సాగింది…
ఈ కార్యక్రమాలలో కూటమి నాయకులు కిషోర్ గౌడ, సుబ్రహ్మణ్యం శెట్టి, దిలీప్ కుమార్, మంజునాథరెడ్డి, గోవిందస్వామి, విశ్వనాథ్, రమేష్,శీనా, వెంకటరామప్ప, బాలాజీ, సురేష్ మరియు జనసేన నాయకులు ప్రసాద్, బాల, నగేష్,హరీష్ మరియు పలు శాఖల అధికారులు,సిబ్బంది తదితరులు పాల్గొన్నారు…
