ePaper
Saturday, September 12, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్నాగలాపురం పట్టణంలో బస్సు డ్రైవర్లకు ట్రాఫిక్ నియమాలపై అవగాహన

నాగలాపురం పట్టణంలో బస్సు డ్రైవర్లకు ట్రాఫిక్ నియమాలపై అవగాహన

📰 Generate e-Paper Clip

నాగలాపురం: సెప్టెంబర్ 4 గరుడధాత్రి :

నాగలాపురం పట్టణంలో రహదారులపై ఏర్పడిన గుంతలు, రహదారి దెబ్బతిన్న పరిస్థితులు మరియు ప్రజల రాకపోకలను దృష్టిలో ఉంచుకొని, పట్టణం మీదుగా ప్రయాణించే ఆర్టీసీ మరియు ప్రైవేట్ బస్సుల డ్రైవర్లకు నాగలాపురం పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా బస్సు డ్రైవర్లకు రహదారి దెబ్బతిన్న ప్రాంతాల్లో వాహనాలను తక్కువ వేగంతో నడపాలని, ప్రజల రాకపోకలకు ఇబ్బంది కలగకుండా జాగ్రత్తలు పాటించాలని సూచించారు. అలాగే నాగలాపురం పట్టణంలో ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించే విధంగా బస్సులను నిలిపివేయకుండా, రహదారినిఆక్రమించకుండా, ప్రజల సురక్షిత రాకపోకలకు ఎలాంటి ఆటంకం కలగకుండా చూడాలనిసూచించారు.అదేవిధంగా ట్రాఫిక్ నిబంధనలుఉల్లంఘించేవాహనదారులకు కౌన్సెలింగ్ నిర్వహించి, ట్రాఫిక్ క్రమశిక్షణ పాటిస్తూ వాహనాలను నడపాలని, ఇతర వాహనదారులు మరియు పాదచారుల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని అవగాహన కల్పించారు.నాగలాపురం పట్టణంలో ట్రాఫిక్ సజావుగా సాగేందుtకు వాహనదారులు, బస్సు డ్రైవర్లు మరియు ప్రజలు పోలీసులకుసహకరించాలని నాగలాపురం పోలీసులు విజ్ఞప్తి చేశారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!