ePaper
Friday, June 12, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తమిళనాడులో ప్రచార హోరుకు తెర..ఇక ఓటర్ల వంతు!

తమిళనాడులో ప్రచార హోరుకు తెర..ఇక ఓటర్ల వంతు!

📰 Generate e-Paper Clip

*తమిళనాడులో ప్రచార హోరుకు తెర..ఇక ఓటర్ల వంతు!* తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల ప్రచార గడువు మంగళవారం సాయంత్రం 6 గంటలతో ముగిసింది. దీంతో ఏప్రిల్ 23న జరగనున్న పోలింగ్‌కు ముందు 48 గంటల పాటు “నిశ్శబ్ద కాలం” అమల్లోకి వచ్చింది. ఈ సమయంలో రాజకీయ పార్టీలు, అభ్యర్థులు సమావేశాలు, ఊరేగింపులు నిర్వహించడం లేదా ప్రచారానికి సంబంధించిన ప్రకటనలు ఇవ్వడంపై నిషేధం విధించారు. ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం, ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కొనసాగుతుంది. ఏప్రిల్ 23న పోలింగ్ జరగనుండగా, మే 4న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను ప్రకటిస్తారు. రాష్ట్రంలో సున్నితమైన ప్రాంతాల్లో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!