బైరెడ్డిపల్లి గరుడదాత్రి జూన్20
బైరెడ్డిపల్లి మండలం లోని తీర్థంగ్రామంలో శనివారం స్వర్ణాంధ్ర స్వచ్చ ఆంధ్ర కార్యక్రమము నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్యాధికారిణి సుస్మిత ఆధ్వర్యంలో స్థానిక జడ్.పి.ఉన్నతపాఠశాల విద్యార్థులచే, వైద్య సిబ్బంది చే ర్యాలీ, మరియు ప్రతిజ్ఞ నిర్వహించారు.అలాగే ముందస్తు యోగాంద్ర సందర్భంగా యోగ శిక్షణ కార్యక్రమము కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈసందర్భంగా డిప్యూటీ హెచ్.ఈ.ఓకాంతమ్మ మాట్లాడుతూ ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలి అని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి అని, చెట్లను ఎక్కువుగా పెంచాలని, అందుకు పర్యావరణన్ని కాపాడాలని పేర్కొన్నారు. యెగ,చేయడం వలనకలిగే లాభాల గురించి వివరించారు.ధ్యానం చేయడం వలన మానసిక ప్రశాంతత ,ఏకాగ్రత లభిస్తుంది అని తెలిపారు. ఈకార్యక్రమంలో హెచ్.ఎస్. తిరుమలమ్మ, సి.హెచ్.ఓ.నవీన,రాజారెడ్డిఅయూబ్,స్కూల్ పిల్లలు, ఉపాద్యాయులు ఆశ తదితరులు పాల్గొన్నారు.
