ePaper
Saturday, June 20, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్విద్యార్థుల నమోదు లక్ష్యాలను పూర్తి చేయాలి

విద్యార్థుల నమోదు లక్ష్యాలను పూర్తి చేయాలి

📰 Generate e-Paper Clip

పిచ్చాటూరు, జూన్ 20 గరుడధాత్రి :

పిచ్చాటూరు మండలంలోని ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులతో శనివారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో మండల విద్యాశాఖ అధికారి పలు కీలక సూచనలు చేశారు. విద్యార్థుల నమోదు కార్యక్రమాన్ని ఈ నెల 30వ తేదీ వరకు వేగవంతంగా నిర్వహించి నిర్దేశిత లక్ష్యాలను పూర్తి చేయాలని ఉపాధ్యాయులకు సూచించారు.

ప్రైవేట్ పాఠశాలల నుంచి ప్రభుత్వ పాఠశాలలకు వచ్చిన విద్యార్థుల విషయంలో తప్పనిసరిగా రిలీజ్ రిక్వెస్ట్ రైజ్ చేయాలని, మూడు రోజులకుపైగా పెండింగ్‌లో ఉన్న రిలీజ్ రిక్వెస్ట్‌లను వెంటనే ఇంటేక్ చేసుకోవాలని ఆదేశించారు.
ప్రస్తుతం మొదటి తరగతి ప్రవేశాల లక్ష్యంలో 90 శాతం పూర్తయిందని, మిగిలిన లక్ష్యాన్ని కూడా త్వరితగతిన పూర్తి చేయాలని తెలిపారు. అలాగే 1వ తరగతి నుంచి తదుపరి తరగతులకు విద్యార్థుల ట్రాన్సిషన్ 100 శాతం పూర్తి చేయాలని సూచించారు. ముఖ్యంగా 6వ తరగతి అడ్మిషన్లలో ట్రాన్సిషన్ తక్కువగా ఉన్నందున హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు ప్రత్యేక దృష్టి సారించాలని పేర్కొన్నారు.
మోడల్ ప్రైమరీ స్కూల్స్‌లో 60 మందికన్నా తక్కువ విద్యార్థులు ఉంటే అవి బేసిక్ ప్రైమరీ స్కూల్స్‌గా మారే అవకాశం ఉందని, అందువల్ల విద్యార్థుల సంఖ్య పెంచేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు.
ప్రతి ఉపాధ్యాయుడు iGOT కర్మయోగి పోర్టల్‌లో అందుబాటులో ఉన్న కోర్సులను తప్పనిసరిగా పూర్తి చేయాలని, అలాగే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమాన్ని అన్ని పాఠశాలల్లో విజయవంతం చేయాలని కోరారు.
ఈ సమావేశంలో ఎంపీడీవో మహమ్మద్ రఫీ పాల్గొని విద్యా ప్రమాణాల పెంపు, విద్యార్థుల నమోదు, పాఠశాలల అభివృద్ధిపై ఉపాధ్యాయులకు పలు సూచనలు చేశారు.
కార్యక్రమంలో ఎంఈవో-2 యుగంధర్ రాజు, పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!