పలమనేరు, జూన్ 19 ( గరుడ ధాత్రి ) :
స్థాపించిన మొదటి సంవత్సరంలోనే పలమనేరు విద్యా చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఇంటర్మీడియట్ ఫలితాల్లో ఎస్.వి జూనియర్ కళాశాల విద్యార్థులు రాష్ట్రస్థాయి అత్యుత్తమ మార్కులు (స్టేట్ ర్యాంక్), పలమనేరు టౌన్ ఫస్ట్ సాధించి కళాశాల ప్రతిష్టను రాష్ట్రస్థాయిలో చాటారు. సిఇసి గ్రూప్ నందు విద్యార్థిని శ్రీ గీత 500 మార్కులకు గాను 495 మార్కులు సాధించి రాష్ట్రస్థాయి అత్యుత్తమ మార్కులతో పాటు టౌన్ టాపర్‌గా నిలిచింది. అదే గ్రూప్‌లో ఇమ్రాన్ భాష 486 మార్కులు, లావణ్య 482 మార్కులతో అత్యుత్తమ ప్రతిభ కనబరిచారు. ఎంపిసి గ్రూప్ నందు విద్యార్థిని జోష్న 470 మార్కులకు గాను 461 మార్కులు సాధించి రాష్ట్రస్థాయి ర్యాంకును కైవసం చేసుకుంది. ఈ అద్భుత విజయానికి మా విద్యార్థుల పట్టుదల, తల్లిదండ్రుల సహకారంతో పాటు ముఖ్యంగా అధ్యాపకుల (లెక్చరర్స్) కమిట్మెంట్ కారణమని కళాశాల చైర్మన్ ఇంటి మనోహర్ కృతజ్ఞతలు తెలియజేశారు. “ఇంటర్మీడియట్ రిజల్ట్స్ లో మా విద్యార్థులు అత్యుత్తమ మార్కులు సాధించి తల్లిదండ్రుల కళ్ళల్లో ఆనందం చూస్తుంటే గుండె గర్వంతో నిండిపోయింది. భవిష్యత్తులో ఇటువంటి స్టేట్ ర్యాంకులు ఎన్నో సాధిస్తాం. ముఖ్యంగా రాబోయే రోజుల్లో ఐఐటీ, నీట్, ఈఏపీసెట్, సిఏ – సిపిట్ వంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లోనూ టాప్ ర్యాంకులు సాధించడమే మా లక్ష్యం” అని చైర్మన్ ధీమా వ్యక్తం చేశారు. స్టేట్ ర్యాంకులు సాధించి పలమనేరు కీర్తిని పెంచిన విద్యార్థులను కళాశాల డైరెక్టర్ హర్ష, అకాడమిక్ డైరెక్టర్ శివ శంకర్ నాయుడు, జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ కిరణ్ కుమార్ బాబు, వైస్ ప్రిన్సిపాల్ మహేంద్ర, డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ రెడ్డప్ప రెడ్డి మరియు అధ్యాపక బృందం ప్రత్యేకంగా అభినందించి, మిఠాయిలు తినిపించి సంబరాలు చేసుకున్నారు.
తొలి ఏడాదిలోనే ‘ఎస్.వి జూనియర్ కళాశాల’ స్టేట్ ర్యాంకుల ప్రభంజనం!
RELATED ARTICLES
