పలమనేరు, సెప్టెంబర్ 19 ( గరుడ ధాత్రి ) : పలమనేరు ప్రాజెక్ట్ పరిధిలోని గంగవరం గ్రామంలో శనివారం దత్తత మరియు పిల్లల సంరక్షణపై అవగాహన కార్యక్రమం విజయవంతంగా నిర్వహించారు. స్థానిక ప్రజలకు దత్తత నిబంధనలు, పెంపకపు సంరక్షణ, బంధువుల దత్తత, సవతి తల్లిదండ్రుల దత్తత, మరణానంతర సంరక్షణ, బాల్య వివాహాల నిరోధం, స్పాన్సర్‌షిప్ తదితర అంశాలపై అధికారులు సమగ్రంగా వివరించారు.
అనంతరం ఐసీడీఎస్ సూపర్‌వైజర్, ఇతర శాఖల అధికారులు మరియు గ్రామస్తుల సమన్వయంతో ఈ అంశాలపై గ్రామంలో ప్రజలకు అవగాహన కల్పిస్తూ ర్యాలీ నిర్వహించారు. ఇదే క్రమంలో గంగవరం పంచాయతీ పరిధిలోని అంగన్వాడీ కేంద్రంలో ‘పోషణ్ మాహ్’ కార్యక్రమాన్ని కూడా జరిపారు. ఈ కార్యక్రమాల్లో ఐసీపీఎస్ ప్రతినిధి సి. శివశంకర్, ఐసీడీఎస్ సూపర్‌వైజర్ కె. మాధవి లత, అంగన్వాడీ ఉపాధ్యాయులు జానకమ్మ, సుజాత, మహేశ్వరి, సుమిత్ర, లైలా, ప్రమీల, సుశీల, ఝాన్సీ, మంజుల తదితరులు పాల్గొన్నారు.
దత్తతపై అవగాహన సదస్సు, పోషణ్ మాహ్ కార్యక్రమం
RELATED ARTICLES
