ePaper
Wednesday, September 16, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్దాతల సహాయంతో క్రీడా దుస్తుల పంపిణీ

దాతల సహాయంతో క్రీడా దుస్తుల పంపిణీ

📰 Generate e-Paper Clip

కార్వేటినగరం సెప్టెంబర్ 15 (గరుడ దాద్రి న్యూస్):

కార్వేటి నగరం మండలం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల గంగమాంబ పురం పాఠశాల కమిటీ కో ఆప్టేడ్ మెంబర్ మహేష్ రెడ్డి పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు దాదాపు పదివేల రూపాయలు విలువచేసే క్రీడా దుస్తులను పిల్లలకు పంపిణీ చేయడం జరిగింది. ఆయన పిల్లను ఉద్దేశించి మాట్లాడుతూ విద్యార్థులు మంచి క్రీడాకారులుగా ఎదిగి గుర్తింపు తెచ్చుకోవాలని పాఠశాలకు మరియు గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని గంగమాంబ పురం పాఠశాలను రాష్ట్రస్థాయిలోనూ జాతీయ స్థాయిలను నిలపాలని ఆకాంక్షించారు అదేవిధంగా అదే గ్రామానికి చెందిన పూర్వ విద్యార్థి మోహన్ రెడ్డి పాఠశాలకు 2000 రూపాయలు ప్రధానోపాధ్యాయుల వారికి అందించి పాఠశాల అభివృద్ధికి ఉపయోగించాలని కోరారు ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు లలితా పాఠశాల పిడి మోహన్ ఉపాధ్యాయులు పాఠశాల కోఆప్టర్ మెంబర్ మహేష్ రెడ్డి ,మాధవి రెడ్డి పాల్గొన్నారు

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!