పిచ్చాటూరు ఆగస్టు 20 గరుడధాత్రి:
నీర్వాయి ఆయిల్ పామ్ నర్సరీలో ఆయిల్ పామ్ తోటల పెంపకాన్ని ప్రోత్సహించడంతో పాటు, ఎరువుల యాజమాన్యం, చీడపీడల నివారణ, ఆధునిక సాగు పద్ధతులు, యాజమాన్య సూత్రాలపై రైతులకు అవగాహన కల్పించేందుకు రైతు అవగాహన సదస్సును విజయవంతంగా నిర్వహించారు.
డిహెచ్ఓ (DHO) జయ భారత్ రెడ్డి, హెచ్ఓ (HO) రాధారాణి, ఏజీఎం (AGM) మురళి, 3F ఆయిల్ పామ్ సిబ్బంది ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.
ఈ సందర్భంగా రైతులకు ఆయిల్ పామ్ సాగులో దిగుబడిని పెంచే ఉత్తమ వ్యవసాయ సాంకేతికతలు, ఎరువుల వినియోగం, చీడపీడల నియంత్రణ, తోటల నిర్వహణ తదితర అంశాలపై నిపుణులు వివరించారు. అలాగే ఉద్యానవన శాఖ ద్వారా అందిస్తున్న వివిధ ప్రభుత్వ సబ్సిడీలు, ఆర్థిక సహాయ పథకాలపై రైతులకు సమగ్ర అవగాహన కల్పించారు.
ఆయిల్ పామ్ సాగు ద్వారా రైతులకు మెరుగైన ఆదాయం లభించే అవకాశాలపై అవగాహన కల్పిస్తూ, శాస్త్రీయ పద్ధతులను పాటించాలని సూచించారు. 3F ఆయిల్ పామ్ సిబ్బంది సమన్వయంతో కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించారు.
