జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి గౌతమ్.
కార్వేటినగరం: ఆగస్టు 3 గరుడదాద్రి న్యూస్
నెలవారి పొదుపును ప్రతి సభ్యురాలు ప్రతి నెల క్రమం తప్పకుండా నిర్ణీత మొత్తాన్ని పొదుపు రూపంలో జమ చేస్తారు. కానీ కార్వేటినగరం టౌన్ లో మాత్రం ఎందుకు జమ చేయడం లేదని జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి బి గౌతమ్ రాజు ఆరోపించారు. సోమవారం కార్వేటినగరంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ కార్వేటినగరం మినహా మిగతా చుట్టుప్రక్కల గ్రామాలలో పొదుపు పంచుకోవడం జరుగుతుందన్నారు. డ్వాక్రా మహిళలు ద్వారా లోను తీరిన వెంటనే పొదుపు ఖాతాల్లో ఉన్న డబ్బును పంచుకోవడం జరుగుతుందన్నారు. కానీ కార్వేటినరం టౌన్ లో లోన్ తీరిన వెంటనే ఎందుకు పొదుపు పంచుకోవడం లేదని దీనిపై వెలుగు ఏపీఎం అధికారి సమగ్ర విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. లోన్ తీస్తే సభ్యురాలు దగ్గర సంఘమిత్రాలు మామూలు వసూలు చేయడం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపైన సమగ్ర విచారణ చేయవలసిందిగా జిల్లా ప్రాజెక్టు డైరెక్టర్ ను కోరుతున్నారు.
నెలవారి పొదుపును జమ చేయడం లేదు ఎందుకు
RELATED ARTICLES
