ePaper
Saturday, October 3, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతినేనడిగింది గోరంత-మీరిచ్చింది కొండంత

నేనడిగింది గోరంత-మీరిచ్చింది కొండంత

📰 Generate e-Paper Clip

* రాష్ట్ర ఐటీ విద్యా శాఖ మంత్రి నారా లోకేష్.
* మంగళగిరిలో పండుగ వాతావరణం లో పట్టాల పంపిణీ.
* ఆనందం వ్యక్తం చేసిన లబ్ధిదారులు.
* మా జీవితాల్లో వెలుగు నింపారంటూ కృతజ్ఞతలు.
కుప్పం,సెప్టెంబర్ 28 (గరుడ ధాత్రి ప్రత్యేక ప్రతినిధి):
నేను అడిగింది 53 వేల ఓట్ల మెజార్టీ అయితే, మీరు నాకు ఏకంగా 92 వేల భారీ మెజార్టీని ఇచ్చి నన్ను గెలిపించారని ఆంధ్రప్రదేశ్ ఐటి విద్యాశాఖల మంత్రి, జాతీయ తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ పేర్కొన్నారు. మంగళగిరిలో సోమవారం పండుగ వాతావరణం లో పట్టాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. లబ్ధిదారులకు పట్టాలు పంపిణీ చేసి ప్రసంగించారు. భారీ మెజార్టీ ఇవ్వడంతో నాపై బాధ్యత మరింత పెరిగిందన్నారు. ప్రతీక్షణం మంగళగిరి ప్రజల సంక్షేమం గురించే ఆలోచిస్తున్నాను అని తెలిపారు.2019 ఎన్నికల ప్రచారంలో ఇళ్ల పట్టాల సమస్యపై మాట ఇచ్చినట్లు గుర్తుచేశారు. సొంతిల్లు అనేది ఒక ఎమోషన్ అని, ఎంతో కష్టపడి ఇల్లు కట్టుకున్న వారిని ఖాళీ చేయాలంటూ భయపెట్టే పరిస్థితులకు ఫుల్ స్టాప్ పెడతానని నాడు హామీ ఇచ్చానని చెప్పారు. ఆ మాట ప్రకారం ఇప్పుడు ఎన్డీయే ప్రభుత్వం తరఫున మూడో విడత కింద సుమారు 400 ఇళ్ల పట్టాలను శాశ్వత హక్కుతో అందిస్తున్నామని ఆయన వెల్లడించారు.మంగళగిరి నియోజకవర్గంలో ఇచ్చిన ప్రతి హామీకి కట్టుబడి ఉన్నానని స్పష్టం చేశారు. తాడేపల్లి మండలం కుంచనపల్లిలోని ‘మన ఇల్లు – మన లోకేష్’ కార్యక్రమంలో భాగంగా 372 మంది లబ్ధిదారులకు శాశ్వత ఇళ్ల పట్టాలు, పి ఎం ఏ వై మంజూరు పత్రాలను ఆయన అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి, 2029 ఎన్నికల లోపు నియోజకవర్గంలోని ప్రతి గడపకూ తాగునీరు, భూగర్భ డ్రైనేజీ, అండర్ గ్రౌండ్ గ్యాస్ కనెక్షన్ అందిస్తానని తెలిపారు. అలాగే, ప్రజల దశాబ్దాల కల అయిన 100 పడకల ఆసుపత్రి నిర్మాణాన్ని వచ్చే ఏడాది తొలి మూడు నెలల్లో పూర్తి చేసి అంకితం చేస్తామని, మహానాడు కట్ట రిటైనింగ్ వాల్ పనులను ప్రణాళికాబద్ధంగా పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.
ఎక్కువ హామీలు ఇవ్వను-ఇచ్చినవన్నీ నిలబెట్టుకుంటా:నేను ఎక్కువ హామీలు ఇవ్వను. కానీ ఇచ్చిన హామీలన్నీ నిలబెట్టుకుంటా. డోర్ టు డోర్ కార్యక్రమం సమయంలో మీరు చెప్పిన సమస్యలన్నీ రాసుకున్నా. ప్రతిదీ నేను మానిటర్ చేస్తున్నా.” అని మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. అందులో భాగంగా ఇంటి పట్టాల కార్యక్రమం చేపట్టామని, ఇంకా చేయాల్సిన కార్యక్రమాలు ఉన్నాయని మంత్రి తెలిపారు. యుద్ధ ప్రాతిపదికగా చేయాల్సిన పనులన్నీ తొలుత చేపడుతున్నామని, భూగర్భ డ్రైనేజి, పైప్ లైన్ ద్వారా తాగునీరు, అండర్ గ్రౌండ్ గ్యాస్ పైప్ లైన్ ప్రక్రియ పూర్తయిన చోట వెంటనే రోడ్లు వేస్తామని మంత్రి లోకేష్ పేర్కొన్నారు.
2019 ఎన్నికల సమయంలో అనేకమంది నాయకులు మంగళగిరి ప్రజల ఇంటిపట్టాల సమస్యపై హామీ ఇవ్వాలని కోరినప్పుడు, సమస్య అర్థం కాక ఆనాడు హామీ ఇవ్వలేకపోయానని మంత్రి నారా లోకేష్ తెలిపారు. గత ఎన్నికల్లో గడపగడపకు వచ్చినప్పుడు దశాబ్దాలుగా ఇక్కడే జీవిస్తున్న వారితో మాట్లాడాకే సమస్య తీవ్రత అర్థమైందన్నారు. సొంత ఇల్లు అనేది ఒక ఎమోషన్ అని, కుటుంబమంతా చెమటోడ్చి కష్టపడి ఇల్లు కట్టుకుంటే, ఆ ఇల్లు మీది కాదని అధికారులు, రాజకీయ నాయకులు భయపెట్టే పరిస్థితులకు ఫుల్స్టాప్ పెట్టేందుకే ఆనాడు హామీ ఇచ్చానని గుర్తుచేశారు. మొదటి విడతలో 3,002, రెండో విడతలో 2,670, మూడో విడతలో 388 పట్టాలు కలిపి మొత్తం సుమారు 2,000 కోట్ల విలువైన ఆస్తికి ప్రజలకు శాశ్వత హక్కులు కల్పించింది ఈ ప్రజా ప్రభుత్వమేనని మంత్రి లోకేష్ వివరించారు.
రాష్ట్రానికి దిక్సూచిగా మంగళగిరి మోడల్ :
మంగళగిరి మొదటిపెట్టిన ప్రక్రియ ఈరోజు యావత్ రాష్ట్రవ్యాప్తంగా అమలవుతోందన్నారు. మంగళగిరిలో పట్టాల సమస్యను నేను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లినపుడు ఆంధ్రప్రదేశ్ లో ఈ సమస్య ఎక్కడున్నా పరిష్కరించాల్సి ఉందని ఆయన నాతో చెప్పారు. అధికారులు, నాయకుల కనీసం ఒక్క గ్లాసు మంచినీరు కూడా తీసుకోకుండా ఇళ్లకు వెళ్లి వివరాలు తీసుకున్నారు. ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు మేమంతా ఒక పట్టుదల, కమిట్ మెంట్ తో పనిచేస్తున్నాం. మంగళగిరిలో వేసిన పునాది ఆంధ్ర రాష్ట్రానికి దిక్సూచిగా మారింది. ఇటీవల విశాఖపట్నంలో 29వేల పట్టాలను ప్రజాప్రభుత్వం ప్రజలకు అందించింది. త్వరలో విజయవాడలో కూడా మరో 24వేలమందికి అందించబోతోంది. ఇది గౌరవ ముఖ్యమంత్రి గారికి పేదల పట్ల ఉన్న కమిట్ మెంట్ అని అన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!