కార్వేటి నగరం సెప్టెంబర్ 19 (గరుడదాద్రి న్యూస్): గ్రామీణ ప్రాంతాల్లో పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకుంటే వ్యాధులు దూరమవుతుందని డిఎల్డిఓ విజయరావ్ అన్నారు. కార్వేటినగరం పంచాయతీలో ఉన్న బండ్రేవు కాలనీలో పరిశీలించారు. స్వచ్చ ఆంధ్ర – స్వచ్చ దివస్ పరిశీలించారు. అనంతరం గ్రామంలో ఏర్పాటు సమావేశంలో ఆయన మాట్లాడుతూ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకుంటే వ్యాధులు దూరమవుతుందని, మురికి కాలనీ శుభ్రంగా ఉంచుకోవాలన్నారు. అనంతరం బృందావనాన్ని పరిశీలించారు. కార్యక్రమానికి మండల స్థాయి అధికారులు మరియు పంచాయతీ కార్యదర్శి గారు హాజరై పారిశుద్ద్య సిబ్బంది తో కలిసి పారిశుద్ద్య పనులు చేపట్టడమైనది. పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవటం ద్వారా అనారోగ్యం బారిన పడకుండా ఉండవచ్చునని తెలిపారు ప్రతి గ్రామ పంచాయతీ లో ప్రతి మూడవ శనివారము తప్పకుండా పారిశుద్ద్య పనులు చేపట్టాలని పంచాయతి కార్యదర్శులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఇంచార్జ్ ఎంపీడీవో మధుసూదన్, పంచాయతీ కార్యదర్శులు పారిశుద్ధ్య కార్మికులు పాల్గొన్నారు.
