గరుడధాత్రి న్యూస్ ఆగస్టు 3 ప్రొద్దుటూరు టౌన్:
ప్రొద్దుటూరు సహాయ పోలీస్ సూపరింటెండెంట్ ఏఎస్పీ శ్రీ యు. విభూ కృష్ణన్ ఐపీఎస్ గారి ఆజ్ఞల మేరకు, 1-టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ సీఐ శ్రీ కొండారెడ్డి గారి పర్యవేక్షణలో ప్రొద్దుటూరు 1-టౌన్ పోలీసులు పాత బీగాలు ఉపయోగించి ద్విచక్ర వాహనాలను దొంగిలిస్తున్న ఒక నిందితుడిని అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి సుమారు 3,50,000 రూపాయల విలువైన 7 మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు.
కేసు వివరాలు:
ప్రొద్దుటూరు టౌన్ ప్రభుత్వ ఆసుపత్రిలో టెక్నీషియన్‌గా పనిచేస్తున్న జెష్టాది సునీల్ కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ప్రొద్దుటూరు 1-టౌన్ పోలీస్ స్టేషన్‌లో క్రైమ్ నెంబర్ 158/2026, సెక్షన్ 303.2 బిఎన్ఎస్ కింద కేసు నమోదు చేయడం జరిగింది.
అరెస్టు చేసిన తీరు:
ఈ రోజు మధ్యాహ్నం 03:30 గంటల సమయంలో విశ్వసనీయ సమాచారం మేరకు సీఐ కొండారెడ్డి గారి మార్గదర్శకత్వంలో, సబ్ ఇన్స్పెక్టర్ ఎస్ఐ శ్రీనివాసులు మరియు వారి సిబ్బంది ఈశ్వర్ రెడ్డి నగర్‌లోని అక్క దేవతల గుడి వద్ద దాడులు నిర్వహించారు. అక్కడ ఉన్న నిందితుడు పెన్నా నగర్‌కు చెందిన స్విగ్గి బాయ్ సూర్యగురు తేజ ను అదుపులోకి తీసుకుని, పెద్దమనుషుల సమక్షంలో విచారించగా పాత బీగాలతో ద్విచక్ర వాహనాలు దొంగిలిస్తున్నట్లు అంగీకరించాడు. అనంతరం సాయంత్రం 05:00 గంటలకు నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.
స్వాధీనం చేసుకున్న వాహనాలు:
సూపర్ స్ప్లెండర్ – ఏపీ 04 హెచ్ 6398
పల్సర్ 150 – ఏపీ 04 బీపీ 4708
సీడీ డీలక్స్ – ఏపీ 04 ఏఎల్ 4638
స్ప్లెండర్ ప్లస్ – ఏపీ 04 ఏఎస్ 5584
సీబీ షైన్ – ఏపీ 39 డీడీ 8929
హోండా యాక్టివా 3జీ
నంబర్ ప్లేట్ లేని మోటార్ సైకిల్ ఛాసిస్ నంబర్: 04C16C04763, ఇంజిన్ నంబర్: 04C15M1875
ఈ కేసులో నిందితుడిని చాకచక్యంగా పట్టుకుని, వాహనాలను రికవరీ చేసిన ప్రొద్దుటూరు 1-టౌన్ సీఐ కొండారెడ్డి, ఎస్ఐ శ్రీనివాసులు మరియు సిబ్బందిని ఏఎస్పీ విభూ కృష్ణన్ ఐపీఎస్ గారు ప్రత్యేకంగా అభినందించారు.
పాత బీగాలతో బైక్‌ల దొంగతనం – నిందితుడి అరెస్ట్, 7 ద్విచక్ర వాహనాలు స్వాధీనం
RELATED ARTICLES
