ePaper
Thursday, September 24, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతిపేదరికం లేని సమాజం చూడాలన్నదే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఉద్దేశం

పేదరికం లేని సమాజం చూడాలన్నదే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఉద్దేశం

📰 Generate e-Paper Clip

సంజీవిని ద్వారా పేదలకు వైద్య సేవలు

-ఎమ్మెల్యే కలికిరి మురళీమోహన్

పూతలపట్టు సెప్టెంబర్ 23 (గరుడ దాత్రి న్యూస్) పేదరికం లేని సమాజం చూడాలన్నదే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉద్దేశమని పూతలపట్టు ఎమ్మెల్యే కలికిరి మురళీమోహన్ అన్నారుపూతలపట్టు మండలం అయ్యప్ప గారి పల్లెలో రూ 36 లక్షలతో నిర్మించిన నేషనల్ ఆరోగ్యం మిషన్ ద్వారా ఆయుష్మాన్ ఆరోగ్యం సెంటర్ను (విలేజ్ హెల్త్ సెంటర్) ఎమ్మెల్యే ప్రారంభించాడు.ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుత భారతదేశంలో పేద ప్రజలకు కార్పొరేట్ వైద్య సేవలు అందించాలని ఉద్దేశంతో మొట్టమొదటిగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంజీవిని పేరుతో విలేజ్ క్లినిక్ కేంద్రాలను ఏర్పాటు చేసి. ప్రతి ఒక్కరి ఆరోగ్య విషయాలను నమోదు చేసి వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలన్నదే సంజీవిని పథకాన్ని తీసుకొచ్చాడని తెలిపాడు. ఒకసారి ఆసుపత్రిలో పేరు నమోదు చేసుకుంటే వివరాలు ఆసుపత్రి వాళ్ళ దగ్గర ఉంటాయని మనం వెళ్లాలంటే సెల్ఫోన్ ద్వారా అపాయింట్మెంట్ తీసుకోవచ్చు అన్నారు. దీని ద్వారా ప్రజలకు వైద్య సేవలు అందించడం సులభతరంఅవుతుందన్నారు. చిత్తూరు జిల్లాలో మొట్టమొదటిగా పూతలపట్టునియోజకవర్గం యాదమరి మండలంలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సంజీవిని పథకాన్ని ప్రారంభించాడని ప్రస్తుతం నియోజకవర్గంలో 8 కోట్ల వ్యయంతో 40 ఆయుష్మాన్ ఆరోగ్య హెల్త్ సెంటర్లను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపాడు. అయ్యప్ప గారి పల్లి లో ఈ సెంటర్ పెట్టడం వల్లచుట్టుపక్కలగ్రామస్తులు దూరప్రాంతాలకు వెళ్లకుండా ఇక్కడే వైద్య సేవలు చేసుకోవచ్చన్నారు ఈ పంచాయతీ తెలుగుదేశం పార్టీకి కంచుకోటని ఎమ్మెల్యే తెలిపాడు.ఇదే కాకుండా రాబోయే రెండేళ్లలో కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేదప్రజల వైద్య సేవలందించడానికి అనేక కార్యక్రమాలుచేపట్టనున్నట్లు తెలిపాడు. ఈ సందర్భంగా అయ్యప్ప గారి పల్లి కు అనేక అభివృద్ధి కార్యక్రమాలుచేపట్టినందుకు ఎమ్మెల్యేని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కుమారి చంద్ర.ఎంపిటిసి కల్పనబాలకృష్ణనాయుడు.మండల కన్వీనర్ దొరబాబు చౌదరి.మాజీ కన్వీనర్లు చంద్రమౌళి. రామచంద్ర నాయుడు.రాష్ట్ర టి ఎన్ టియు సి కార్యదర్శి యువరాజుల నాయుడు. కానిపాకం బోర్డు సభ్యులు నాగరాజు నాయుడు.జిల్లా వాణిజ్య విభాగం అధ్యక్షుడు హిమగిరి నాయుడు క్లస్టర్ ఇంచార్జి చంద్రబాబు. సింగల్ విండో అధ్యక్షుడు జగన్నాథం.పి ఆర్ ఈ నవీన్ కుమార్.డి ఈ ప్రసాద్ నాయుడు.ఎంపీడీవో నాగరాజు
డాక్టర్ యశ్వంత్. ఏపీవో సంధ్యారాణి.గ్రామ కమిటీ అధ్యక్షుడు విజయ్ కుమార్. నాయకులు బాలకృష్ణ నాయుడు. ఏకాంబరం.మోహన్ నాయుడు. నేతాజీ.రాజేందర్ నాయుడు. రామమూర్తి నాయుడు.దేవరాజు నాయుడు. వైద్య సిబ్బంది ప్రజలు పాల్గొన్నారు

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!