ePaper
Friday, June 19, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్ప్రకృతి వ్యవసాయంలో ఆదర్శంగా నిలిచిన రైతులకు పురస్కారం

ప్రకృతి వ్యవసాయంలో ఆదర్శంగా నిలిచిన రైతులకు పురస్కారం

📰 Generate e-Paper Clip

✒తిరుపతి జిల్లా సత్యవేడు డివిజన్‌లో ప్రకృతి వ్యవసాయాన్ని విజయవంతంగా అమలు చేస్తూ, ఇతర రైతులకు సైతం స్ఫూర్తిగా నిలుస్తున్న యువ రైతులు వేదముత్తు, నలన్‌ కు ఉత్తమ రైతు అవార్డులు ప్రదానం చేశారు. కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా ప్రాజెక్టు మేనేజర్ ఏ. శణ్ముగం, కృషి విజ్ఞాన కేంద్రం డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాసులు, జిల్లా బీజేపీ కార్యదర్శి చేతుల మీదుగా అవార్డులు అందజేసి ఘనంగా సత్కరించారు.

ప్రకృతి వ్యవసాయం ద్వారా తక్కువ ఖర్చుతో నాణ్యమైన, ఆరోగ్యకరమైన ఆహార ఉత్పత్తులను సాధించడంతో పాటు, తోటి రైతులకు అవగాహన కల్పిస్తూ తమ పొలాల్లో ఈ పద్ధతులను అమలు చేయించడంలో వీరు విశేష కృషి చేస్తున్నారని అధికారులు కొనియాడారు. రైతులు రసాయన రహిత వ్యవసాయ పద్ధతులను మరింతగా స్వీకరించి, స్థిరమైన వ్యవసాయాభివృద్ధికి తోడ్పడాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఈ అవార్డు యువ రైతుల కృషికి గుర్తింపుగా నిలిచిందని పలువురు అభిప్రాయపడ్డారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!