ePaper
Friday, June 19, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్చిత్తూరు ఉమ్మడి జిల్లాల్లో BSNL సేవలను మారుమూల గ్రామాలకు చేరువ చేసేందుకు చర్యలు

చిత్తూరు ఉమ్మడి జిల్లాల్లో BSNL సేవలను మారుమూల గ్రామాలకు చేరువ చేసేందుకు చర్యలు

📰 Generate e-Paper Clip

-57 కొత్త 4G మొబైల్ టవర్స్ ను ఏర్పాటు చేయడానికి సన్నాహాలు

చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావు, PGM.AV శ్రీ కుమార్ వెల్లడి..

ఆధునిక యుగానికి అనుగుణంగా.,BSNL సేవలను చిత్తూరు ఉమ్మడి జిల్లాల్లోని మారుమూల గ్రామాలకు సైతం చేరువ చేసేందుకు పటిష్ట చర్యలకు పూనుకున్నట్లు చిత్తూరు పార్లమెంటు సభ్యులు దగ్గుమళ్ళ ప్రసాదరావు, BSNL-PGM-AV శ్రీ కుమార్ వెల్లడించారు. అంతేకాకుండా సాంకేతిక పరిజ్ఞానాన్ని దృష్టిలో ఉంచుకుని 57 కొత్త 4G మొబైల్ టవర్స్ ను ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని వారు తెలియజేశారు‌.

గురువారం తిరుపతిలోని
BSNL ప్రధాన కార్యాలయంలో టెలికాం అడ్వైజరీ కమిటీ సమావేశాన్ని అడ్వైజరీ కమిటీ చైర్మన్, చిత్తూరు పార్లమెంటు సభ్యులు దగ్గుమళ్ళ ప్రసాదరావు అధ్యక్షతన నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావు, భారత ప్రభుత్వ సహకారంతో BSNL చేపట్టిన 4G సాచురేషన్ టవర్ ప్రాజెక్టు పనులు, ఫైబర్ కనెక్టివిటీ సేవలకు సంబంధించిన పలు అంశాల పై సమీక్షించారు. BSNL ఉన్నతాధికారులు, ఉద్యోగులు సమన్వయంతో పనిచేయాలనీ, BSNL సేవలను విస్తృత పరచాలని చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావు, BSNL టెలికాం అడ్వైజరీ కమిటీ సభ్యులకు దిశానిర్దేశం చేశారు.
అలాగే వినియోగదారులు తమ సమస్యలను సలహా మండలి దృష్టికి తీసుకొచ్చి, పరిష్కారం పొందాలని ఆయన కోరారు.

అనంతరంBSNL టెలికాం అడ్వైజరీ కమిటీ చైర్మన్, చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావు, BSNL-PGM-AV శ్రీ కుమార్ మాట్లాడుతూ మారుతున్న కాలానికి అనుగుణంగా ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలో 112 టెలికాం 4Gను నిర్మించినట్లు చెప్పారు. వీటి ఏర్పాటు వల్ల సిగ్నల్స్ అందని, మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో BSNL 4G సేవలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. వచ్చే ఆరు నెలల్లో 57 కొత్త 4G మొబైల్ టవర్స్ ను పూర్తి చేసేందుకు ప్రణాళికలను రూపొందించుకుని ముందుకు సాగుతున్నట్లు వివరించారు. ఇందులో ముఖ్యంగా చిత్తూరు పార్లమెంటు పరిధిలో-22, తిరుపతి పార్లమెంటు పరిధిలో 14, మరియు రాజంపేట పార్లమెంట్ పరిధిలో 14 టవర్లను ఏర్పాటు చేసి, త్వరితగతిన పూర్తి చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు వారు వెల్లడించారు.
ఈ ప్రాజెక్టు వలన గ్రామీణ ప్రాంతాలకు టెలికాం సేవలు విస్తరిస్తాయని చెప్పిన చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావు, పనులను సకాలంలో పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు.రెవిన్యూ , రోడ్లు & భువనాలు, అటవీ శాఖ విభాగాలకు సంబంధించి, ఏదైనా అవరోధాలు ఉంటే..,తమ దృష్టికి తీసుకురావాలని, సంబంధిత అధికారులతో చర్చించి, సమస్యకు పరిష్కారాన్ని చూపుతానని ఎంపీ దగ్గుమళ్ళ అన్నారు.
ఈ సమావేశంలో DGMs వెంకోబారావు, జయశంకర్, దామోదర్, శివరాం,BSNL సిబ్బంది, జిల్లాలోని AGM, DEలు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!