ePaper
Sunday, June 14, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్ప్రజల ప్రేమాభిమానాలు, నారా లోకేష్ ప్రొత్సాహంతోనే సభ విజయవంతం...

ప్రజల ప్రేమాభిమానాలు, నారా లోకేష్ ప్రొత్సాహంతోనే సభ విజయవంతం…

📰 Generate e-Paper Clip

టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ కోడూరు బాలసుబ్రమణ్యం..
తిరుపతి, జూన్ 12 :
ఎన్డీఏ పాలన రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా తిరుపతిలో నిర్వహించిన విజయోత్సవ సభ ప్రజల ప్రేమాభిమానాలు కార్యకర్తల కష్టం నారా లోకేష్ ప్రోత్సాహమే విజయవంతం కావడానికి రహస్యమని తెలుగు దేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ కోడూరు బాలసుబ్రమణ్యం తెలిపారు. విజయోత్సవ సభకు శుక్రవారం తిరుపతి నగరంలోని పలు డివిజన్లో నుంచి డాక్టర్ కోడూరు బాలసుబ్రమణ్యం ఆధ్వర్యంలో సుమారు 2000 మంది పార్టీ నాయకులు, కార్యకర్తలు వచ్చే ర్యాలీగా తరలివచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత వారం రోజులుగా విజయోత్సవ సభ ఏర్పాట్లు సమన్వయం, జన సమీకరణ, ప్రచార కార్యక్రమాలు , క్లస్టర్ హెడ్ లకు వార్డు నాయకులకు బూత్ కన్వీనర్లు కేఎస్ఎస్ బృందాలు యువత మహిళలు కార్యకర్తలు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ విజయోత్సవ సభ ఏ ఒక్కరి కృషి వల్ల కాదని తెలుగుదేశం పార్టీ కుటుంబం మొత్తం కలసికట్టుగా సమన్వయంతో సమిష్టి యజ్ఞమని చెప్పారు. రాష్ట్రంలోని పలు జిల్లాల నుండి ప్రజలు స్వచ్ఛందంగా కుటుంబ సమేతంగా విజయోత్సవ సభకు తరలి వచ్చారని, వర్షాన్ని సైతం లెక్కచేయకుండా సభలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రసంగిస్తున్నప్పుడు అక్కడే ఉండిపోయారన్నారు. ఈ సభ విజయవంతం కావడంతో మాకు మరింత ఉత్సాహాన్ని ఇచ్చిందన్నారు. సభ అనంతరం తిరుగు ప్రయాణమైన నారా లోకేష్ ను డాక్టర్ కోడూరు బాలసుబ్రమణ్యం మర్యాదపూర్వకంగా కలిశారు. నారా లోకేష్ కోడూరు బాలసుబ్రమణ్యం వెన్ను తట్టి తిరుపతి నియోజకవర్గం లో పార్టీ బలోపేతం కోసం పనిచేయండి భవిష్యత్తులో మీకు మంచి జరుగుతుంది అని చెప్పడంతో డాక్టర్ బాలసుబ్రమణ్యం కు మరింత ఉత్సాహాన్ని ఇచ్చింది. అధినాయకత్వం తన కార్యకర్తల శ్రమను గుర్తించి ప్రోతించినప్పుడే వచ్చే ఆత్మవిశ్వాసం వెలకట్టలేనిదని పేర్కొన్నారు. ఈ విజయాన్ని ప్రజలకు అంకితం చేస్తున్నామని తిరుపతి ప్రజల ప్రేమ కార్యకర్తల అంకితభావం నాయకత్వం పట్ల ఉన్న విశ్వాసమే ఈ విజయోత్సవ సభను ఘన విజయంగా నిలబెట్టాయని అన్నారు. ప్రజల ఆశీర్వాదం కార్యకర్తల శ్రమ నాయకత్వం దిశ నిర్దేశం ఇవే విజయానికి మూడు స్తంభాలాన్ని డాక్టర్ కోడూరు బాలసుబ్రమణ్యం తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!