ePaper
Thursday, July 30, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్బాల్య వివాహాలను అరికట్టడానికి ప్రతి ఒక్కరూ సహకరించాలి : జూనియర్ సివిల్ న్యాయమూర్తి లిఖిత

బాల్య వివాహాలను అరికట్టడానికి ప్రతి ఒక్కరూ సహకరించాలి : జూనియర్ సివిల్ న్యాయమూర్తి లిఖిత

📰 Generate e-Paper Clip

పలమనేరు, జులై 27 ( గరుడ ధాత్రి ) :
విద్యార్థులు చిన్నతనం నుంచే చట్టాలపై అవగాహన పెంచుకోవాలని, సమాజంలో బాల్య వివాహాలను అరికట్టడానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని పలమనేరు ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ న్యాయమూర్తి లిఖిత పిలుపునిచ్చారు.గంగవరం మండలంలోని సాయి కిషోర్ జూనియర్ కాలేజ్ మరియు కృష్ణారెడ్డి సాయి శ్రీ చైతన్య చిల్డ్రన్స్ అకాడమీ నందు న్యాయ విజ్ఞాన సదస్సులను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన న్యాయమూర్తి లిఖిత గారు మాట్లాడుతూ.. బాల్య వివాహాల నిరోధక చట్టం, ర్యాగింగ్ చట్టాలు, ఉమెన్ ట్రాఫికింగ్ (మహిళల అక్రమ రవాణా) మరియు గుడ్ టచ్ – బాడ్ టచ్ అంశాలపై విద్యార్థులకు క్లుప్తంగా అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… నేటి సాంకేతిక యుగంలో సెల్ ఫోన్లలో మంచి, చెడు రెండూ లభిస్తాయని, విద్యార్థులు మంచి విషయాలను మాత్రమే స్వీకరించి, చెడు విషయాలకు దూరంగా ఉండాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఇర్షాద్ అలీ ఖాన్, వైస్ ప్రెసిడెంట్ కృష్ణమూర్తి, సాయి కిషోర్ కళాశాల చైర్మన్ శైలజ, కళాశాల కరస్పాండెంట్ సాయి కిషోర్, కృష్ణారెడ్డి శ్రీ చైతన్య చిల్డ్రన్స్ అకాడమీ ప్రిన్సిపల్ కుమార స్వామి రెడ్డి, అలాగే పాఠశాల, కళాశాలల సిబ్బంది పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!