నాగలాపురం మండలంలోని బూత్ ఏజెంట్లకు అప్పగించిన ఓటర్ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని వైఎస్ఆర్సిపి మండల అధ్యక్షుడు అపరంజి రాజు సూచించారు. పార్టీ బలోపేతానికి ప్రతి బూత్ స్థాయిలో ఓటర్ల వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి, పెండింగ్‌లో ఉన్న ప్రక్రియను ఆలస్యం చేయకుండా పూర్తి చేయాలని ఆయన కోరారు.
ఓటర్ల వివరాల్లో ఎలాంటి పొరపాట్లు లేకుండా జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ప్రతి బూత్ ఏజెంట్ తనకు కేటాయించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించి, నిర్ణీత గడువులోగా ఓటర్ ప్రక్రియను పూర్తి చేయాలని అపరంజి రాజు పిలుపునిచ్చారు.
బూత్ ఏజెంట్లు ఓటర్ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలి – వైకాపా మండల అధ్యక్ష్యుడు అపరంజిరాజు
RELATED ARTICLES
