ePaper
Tuesday, September 22, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్బైరెడ్డిపల్లి మండలంలో 16 ఎం.పి టి.సిలకు 58 పోలింగ్ కేంద్రాల తుది జాబితా ప్రచురణ

బైరెడ్డిపల్లి మండలంలో 16 ఎం.పి టి.సిలకు 58 పోలింగ్ కేంద్రాల తుది జాబితా ప్రచురణ

📰 Generate e-Paper Clip

బైరెడ్డిపల్లి గరుడదాత్రి సెప్టెంబర్ 19

రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఎం.పి.టి.సి,జడ్.పి.టి.సి ఎన్నికలు–2026కు సంబంధించి బైరెడ్డిపల్లి మండలంలోని 16 ఎంపిటిసి స్థానాలలో 58 పోలింగ్ కేంద్రాల తుది జాబితాను చిత్తూరు జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ఆమోదంతో ప్రచురించినట్లు ఎంపీడీఓ కె. ఆనందబాబు పేర్కొన్నారు.ఎం.పి.టి.సిల వారీగా గ్రామాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాల వివరాలు ఇలా ఉన్నాయి. ఆలపల్లి–4: రామాపురం (2), మూగనపల్లి, ఆలపల్లి; ఎం.కొత్తూరు–4: ఎం.కొత్తూరు (2), గడ్డూరు (2); గొల్లచీమనపల్లి–4: గొల్లచీమనపల్లి (2), చిన్నచెల్లారిగుంట (2); బేలుపల్లి–4: బేలుపల్లి (3), చిక్కనపల్లి; లక్కనపల్లి–4: లక్కనపల్లి (4); తీర్థం–3: తీర్థం (2), కైగల్ ; దేవదొడ్డి–5: దేవదొడ్డి (2), కామినాయనిపల్లి, గంగినాయనిపల్లి (2); కమ్మనపల్లి–2: కమ్మనపల్లి (2); బైరెడ్డిపల్లి-2–3: నాగిరెడ్డిపల్లి (3); బైరెడ్డిపల్లి-1–4: బైరెడ్డిపల్లి (4); పాతపేట–5: పాతూరునత్తం (2), పాతపేట (2), కమ్మనపల్లి; కడపనత్తం–4: టి.ఎన్.కుప్పం, కడపనత్తం, గౌనితిమ్మేపల్లి (2); వెంగంవారిపల్లి–2: కడతట్లపల్లి, వెంగంవారిపల్లి; ధర్మపురి–3: ధర్మపురి (2), మేకలనాగిరెడ్డిపల్లి; చప్పిడిపల్లి–3: జంగాల అగ్రహారం, చప్పిడిపల్లి (2); నెల్లిపట్ల–4: నెల్లిపట్ల (4). ఒకే ప్రాంతంలో ఒకటి కంటే ఎక్కువ పోలింగ్ కేంద్రాలు ఉన్నచోట వాటి సంఖ్యను ఈ పైన బ్రాకెట్లలో పేర్కొన్నారు. తుది జాబితానుస్థానిక ఎం.పి.డి.ఓ.కార్యాలయం తహసీల్దార్ కార్యాలయం మండలంలోని అన్ని గ్రామ పంచాయతీ కార్యాలయాల నోటీస్ బోర్డుల్లో రాజకీయ పార్టీలు, ప్రజల పరిశీలనార్థం అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంఎస్‌జీఓ సుజాత, కార్యాలయ సిబ్బంది ఇంతియాజ్, బాలాజీ, సుష్మ కీర్తి, సురేష్, సుమతి, మహేశ్వరి, లావణ్య, విజయ, రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!