36 కి చేరుకున్న నామినేషన్లు.
బైరెడ్డిపల్లి గరుడదాత్రి అక్టోబర్22
ఎం.పి.టి.సి. ఎన్నికలు–2026కు సంబంధించి బైరెడ్డిపల్లి మండల పరిషత్ కార్యాలయంలో గురువారం 28 నామినేషన్లు అందినట్లు రిటర్నింగ్ అధికారి ఎన్. వెంకటరాముడు తెలిపారు. తొలిరోజు అందిన 8 నామినేషన్లతో కలిపి ఇప్పటివరకు మొత్తం 36 నామినేషన్లు స్వీకరించినట్లు పేర్కొన్నారు. టీడీపీ తరఫున15నామినేషన్లుబేలుపల్లి, తీర్థం స్థానాలకు రెండేసి; బైరెడ్డిపల్లి–1, బైరెడ్డిపల్లి–2, చప్పిడిపల్లి, ధర్మపురి, గొల్లచీమనపల్లి, కడపనత్తం, లక్కనపల్లి, ఎం.కొత్తూరు, నెల్లిపట్ల, పాతపేట, వెంగంవారిపల్లి స్థానాలకు ఒక్కొక్కటి చొప్పున దాఖలయ్యాయి. వైఎస్సార్‌సీపీ తరఫున 12 నామినేషన్లు: గొల్లచీమనపల్లికి మూడు; బేలుపల్లి, కమ్మనపల్లికి రెండేసి; ఆలపల్లి, చప్పిడిపల్లి, కడపనత్తం, నెల్లిపట్ల, పాతపేట స్థానాలకు ఒక్కొక్కటి చొప్పున అందాయి. బైరెడ్డిపల్లి–2 స్థానానికి స్వతంత్ర అభ్యర్థిగా ఒక నామినేషన్ దాఖలైంది. దేవదొడ్డి స్థానానికి నామినేషన్లు అందలేదు.
నామినేషన్ల స్వీకరణ కార్యక్రమంలో రిటర్నింగ్ అధికారి ఎన్. వెంకటరాముడు, సహాయ రిటర్నింగ్ అధికారి, ఎంపీడీఓ కె. ఆనందబాబు, సహాయ రిటర్నింగ్ అధికారి, తహసీల్దార్ ఎం.ఎస్. ప్రసన్నకుమార్ తదితరులు పాల్గొన్నారు.
