ePaper
Saturday, October 3, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతిబైరెడ్డిపల్లి లో గృహంలో వైభవంగా పురటాసి శనివారం పూజలు

బైరెడ్డిపల్లి లో గృహంలో వైభవంగా పురటాసి శనివారం పూజలు

📰 Generate e-Paper Clip

బైరెడ్డిపల్లి గరుడదాత్రి అక్టోబర్ 3:

తమిళ పురటాసినెల తమిళులు శనివారం రోజులలో ఇష్ట దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామిని కొలుస్తుంటారు. మండల కేంద్రమైన బైరెడ్డిపల్లి లో గాండ్ల కులస్తులు శనివారం నాడు పురోహితులు మురళీధర్ ఆచార్యుల ఆధ్వర్యంలోవైభవంగా జరుపుకున్నారు.
లక్ష్మీవెంకటేశ్వరస్వామివారిని కలశాలలో ఏర్పాటు చేసుకుని సుగంధ పుష్పాలతో సుందరంగా అలంకరించి, వెంకటేశ్వర స్వామి వారి ప్రతిమకు పంచామృత అభిషేకములు జరిపి,అష్టోత్తర శతనామాలతో, పూజలు చేశారు. బంధుమిత్రులను పిలిచి స్వామివారి నైవేద్యములను పంచారు. కార్యక్రమంలో రామ్మోహన్, మూర్తి, గోవిందరాజులు, చిన్న రెడ్డప్ప తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!