ePaper
Friday, October 30, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్భారీ వర్షాల హెచ్చరిక.. పిచ్చాటూరులో 24 గంటల కంట్రోల్ రూమ్ ఏర్పాటు

భారీ వర్షాల హెచ్చరిక.. పిచ్చాటూరులో 24 గంటల కంట్రోల్ రూమ్ ఏర్పాటు

📰 Generate e-Paper Clip

లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలి.. అధికారులకు తహశీల్దార్ ఆదేశాలు

పిచ్చాటూరు, అక్టోబర్ 28 గరుడాద్రి న్యూస్ :
తిరుపతి జిల్లాలో అక్టోబర్ 27 నుంచి 30వ తేదీ వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న హెచ్చరికల నేపథ్యంలో పిచ్చాటూరు తహశీల్దార్ కార్యాలయంలో 24 గంటల కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు తహశీల్దార్ వై. చంద్రబాబు నాయుడు తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రజలకు తక్షణ సహాయం అందించేందుకు సిబ్బందికి షిఫ్టుల వారీగా విధులు కేటాయించినట్లు పేర్కొన్నారు.
భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆయన ఆదేశించారు. లోతట్టు ప్రాంతాల్లో నివసించే ప్రజలను ముందస్తుగా అప్రమత్తం చేయడంతో పాటు, అవసరమైతే వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు పునరావాస కేంద్రాలను సిద్ధం చేయాలని సూచించారు. వర్షాల కారణంగా వాగులు, వంకలు పొంగిపొర్లే అవకాశం ఉన్నందున వంతెనలు, కల్వర్టుల వద్ద పోలీసు నిఘా ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
అదేవిధంగా మండల పరిధిలోని చెరువుల నీటిమట్టాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని, ఎలాంటి ప్రమాదాలు చోటుచేసుకోకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రజలకు అందుబాటులో ఉంటూ సహాయక చర్యలు వేగవంతం చేయాలని స్పష్టం చేశారు.
విధుల నిర్వహణలో నిర్లక్ష్యం వహించే సిబ్బందిపై శాఖాపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని తహశీల్దార్ వై. చంద్రబాబు నాయుడు హెచ్చరించారు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైన జాగ్రత్తలు పాటించాలని సూచించారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!