-పిచ్చాటూరులో ఈనెల 5న పీజీఆర్‌ఎస్..
-ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని తహసిల్ధార్ విఙ్ఞప్తి
పిచ్చాటూరు, అక్టోబర్ 4 గరుడధాత్రి :
ప్రజా సమస్యల పరిష్కారానికి పిచ్చాటూరు మండల పరిషత్ అభివృద్ధి అధికారి కార్యాలయంలో ఈనెల 5 సోమవారమున ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక నిర్వహించనున్నట్లు తహశీల్దార్ చంద్రబాబు నాయుడు తెలిపారు.
ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు జరిగే ఈ కార్యక్రమంలో అన్ని శాఖలకు చెందిన మండల స్థాయి అధికారులు పాల్గొంటారు. మండల స్థాయిలో పరిష్కరించాల్సిన సమస్యలను ప్రజలు ముందుగా ఇక్కడే ఫిర్యాదు చేయాలని అధికారులు సూచించారు.
ఫిర్యాదు అందజేసిన ప్రతి ఒక్కరికీ రశీదు అందజేస్తారు. నిర్ణీత గడువులో సమస్య పరిష్కారం కాకపోతే సంబంధిత కార్యాలయాన్ని సంప్రదించేందుకు ఈ రశీదు ఉపయోగపడుతుందని తెలిపారు.
కేవలం జిల్లా కలెక్టర్ స్థాయిలో పరిష్కరించాల్సిన సమస్యలున్న వారు మాత్రమే తిరుపతి కలెక్టరేట్‌ను ఆశ్రయించాలని సూచించారు. ప్రజలు తమ సమస్యలకు సంబంధించిన ఆధార పత్రాలతో హాజరై పీజీఆర్‌ఎస్ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తహశీల్దార్ కోరారు.
