కార్వేటి నగరం అక్టోబర్ 1 (గరుడదాద్రి న్యూస్): కార్వేటినగరం మండలం కేఎం పురం ఎస్టీ కాలనీ చెందిన ముత్యాలయ్య కుమారుడు వేణు 28 మతిస్థిమితం లేకుండా తిరుగుతూ సెప్టెంబర్ నెల 27వ తేదీ రాత్రి విషపూరిత ఆకు తినడంతో 28వ తేదీ ఉదయం వాంతులు చేసుకోవడంతో గమనించిన కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ 29 మృతి చెందాడు. మృతిని తండ్రి ముత్యాలయ్య స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో ఫిర్యాదు మేరకు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తేజస్విని తెలిపారు. మృతదేహాన్ని పుత్తూరు హాస్పిటల్ తరలించి పోస్ట్మార్టం అనంతరం వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు.
