తిరుపతి జిల్లా పోలీస్ శాఖ.
– మహాత్మ బసవ జయంతి సందర్భంగా ఘన నివాళులు.
– జిల్లా ఎస్పీ శ్రీ ఎల్. సుబ్బరాయుడు, ఐపీఎస్., గారు చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు.
– మహాత్మ బసవ జయంతి సందర్భంగా తిరుపతి జిల్లా ఎస్పీ శ్రీ ఎల్. సుబ్బరాయుడు, ఐపీఎస్., గారు ఈ రోజు ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని మహాత్మ బసవేశ్వరుని చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు.
– ఈ సందర్భంగా ఎస్పీ గారు మాట్లాడుతూ, మహాత్మ బసవేశ్వరుడు సమాజంలో సమానత్వం, న్యాయం, సత్యం కోసం చేసిన సేవలు అమోఘమని తెలిపారు. ఆయన బోధనలు సమాజానికి మార్గదర్శకంగా నిలుస్తాయని, ముఖ్యంగా యువత ఆయన ఆలోచనలను ఆచరణలో పెట్టాలని సూచించారు.
– ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీలు శ్రీ వెంకటరావు (పరిపాలన) శ్రీ శ్రీనివాసరావు (సాయిదళం) శ్రీమతి శ్రీ గీతా కుమారి గారు (ఎస్ బి) మరియు పోలీస్ అధికారులు మరియు సిబ్బంది పాల్గొని మహాత్మ బసవేశ్వరుని సేవలను స్మరించుకున్నారు.
