ePaper
Wednesday, July 29, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్ముందు జాగ్రత్తలతో క్యాన్సర్ ముప్పు నుంచి తప్పించుకోవచ్చు

ముందు జాగ్రత్తలతో క్యాన్సర్ ముప్పు నుంచి తప్పించుకోవచ్చు

📰 Generate e-Paper Clip

* సీఎం సతీమణి నారా భువనేశ్వరి.
* కుప్పంలో 2వ రోజు పర్యటనలో భాగంగా పలు కార్యక్రమాల్లో పాల్గొన్న నారా భువనేశ్వరి.
* కుప్పం ప్రభుత్వాసుపత్రిని సందర్శించి, స్విమ్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మొబైల్ క్యాన్సర్ స్క్రీనింగ్ యూనిట్, టీఎన్‌ఎస్ఎఫ్ ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన భువనేశ్వరి.
కుప్పం,జులై 28 (గరుడ ధాత్రి న్యూస్): ముందు జాగ్రత్త చర్యలతో క్యాన్సర్ ముప్పు నుంచి తప్పించుకోవచ్చునని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సతీమణి, ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి అన్నారు. కుప్పం నియోజకవర్గంలో నాలుగు రోజుల పర్యటనలో భాగంగా రెండవ రోజు మంగళవారం వివిధ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఉదయం కుప్పంలోని వంద పడకల ప్రాంతీయ వైద్యశాలను చేరుకున్నారు. ఈ సందర్భంగా క్యాన్సర్ శిబిరాన్ని, టిఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ, క్యాన్సర్ స్త్రీనింగ్ యూనిట్‌ ఏర్పాటు చేసిన స్విమ్స్ ప్రతినిధులను అభినందిస్తున్నాను. ముందస్తు జాగ్రత్తలు చెప్పడం, చైతన్యం కలిగించడం వల్ల క్యాన్సర్ ముప్పు నుంచి మహిళలను రక్షించవచ్చు. ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఇలాంటి కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు.
తలసీమియా వ్యాధిగ్రస్తులకు ఎన్టీఆర్ ట్రస్ట్ అండగా నిలుస్తోందన్నారు.
వ్యాధిగ్రస్త పిల్లలకు సురక్షితమైన రక్తాన్ని ఉచితంగా అందిస్తున్నామన్నారు. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లేందుకు సీఎం చంద్రబాబు కృషి చేస్తున్నారన్నారు.
కుప్పం ప్రజలు నన్ను ఎంతగానో ఆదరిస్తున్నారని, ఎప్పటికీ మర్చిపోను అన్నారు.గతంలో కుప్పం నియోజకవర్గం నుంచి ఉద్యోగాల కోసం కర్ణాటకకు వలసలు వెళ్లేవారని,
కుప్పానికి ముఖ్యమంత్రి ఒకేసారి 30 పరిశ్రమలు తెచ్చారన్నారు.ఈ పరిశ్రమల ద్వారా వేలాదిమందికి ఉపాధి, ఉద్యోగ అవకాశాలు లభిస్తాయన్నారు.కుప్పం అభివృద్ధిపై సీఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టి పెట్టారన్నారు.
డీఎస్సీ నిర్వహణపై వైసీపీ చేస్తోన్న తప్పుడు ప్రచారాన్ని ప్రజలు గమనిస్తున్నారని ప్రజలే బుద్ధి చెబుతారన్నారు. ఈ కార్యక్రమంలో టిఎన్ఎస్ఎఫ్ నాయకులు, స్థానిక నాయకులు, ఆసుపత్రి వైద్యులు, ఆసుపత్రి వైస్ ప్రెసిడెంట్ భారతి త్రిలోక్ నాయుడు, కుప్పం టిడిపి ఇన్చార్జ్ మునిరత్నం తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!