వెదురు కుప్పం. గరుడ దాద్రి న్యూస్ జూన్ 24
వెదురు కుప్పం మండలం పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన ఒక మైనర్ బాలిక అదృశ్య కేసు దర్యాప్తులో కీలక పురోగతి సాధించబడింది. మైనర్ బాలిక అదృశ్యమైనట్లు అందిన ఫిర్యాదు మేరకు వేదురుకుప్పం పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో భాగంగా బాలికను గుర్తించి ఆమె వాంగ్మూలం నమోదు చేయగా, నిందితుడు ప్రేమ పేరుతో మైనర్ బాలికను మోసగించి తన వెంట తీసుకెళ్లినట్లు మరియు ఆమెపై లైంగిక దాడికి పాల్పడినట్లు వెలుగులోకి వచ్చింది. దీనితో కేసును సంబంధిత సెక్షన్లు మరియు పోక్సో చట్టం సెక్షన్ల కింద మార్చి దర్యాప్తు కొనసాగించారు. ఈ నేపథ్యంలో, నిందితుడు ఎం. సింహాద్రి ను 24-06-2026 తేదీన పచ్చికాపలం జంక్షన్ వద్ద పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడిని న్యాయస్థానం ఎదుట హాజరు పరచగా, న్యాయస్థానం అతనికి జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. మైనర్ బాలికలపై జరిగే నేరాల పట్ల జిల్లా పోలీసులు అత్యంత కఠినంగా వ్యవహరిస్తారని నేరానికి పాల్పడిన వారిపై సెక్సుయల్ ఒఫ్ఫెన్డర్ షీట్స్ ఓపెన్ చేసి వారి పై నిరంతర నిఘా ఉంచుతారని, తల్లిదండ్రులు తమ పిల్లలపై నిరంతర పర్యవేక్షణ కలిగి ఉండాలని, అనుమానాస్పద పరిస్థితులు గమనించిన వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించాలని ప్రజలకు తెలియజేశారు. అదేవిధంగా పోలీస్ సిబ్బంది సభ్యుని ఇన్స్పెక్టర్ హనుమంతప్ప, రమణబాబు, ముని రెడ్డి, ఉన్నారు.
మైనర్ బాలికను ప్రేమ పేరుతో మోసం చేసిన వ్యక్తి సింహాద్రి అరెస్టు
RELATED ARTICLES
