కార్వేటి నగరం ఆగస్టు 5 గరుడదాద్రి న్యూస్
కార్వేటి నగరం మేజర్ పంచాయతీ మాజీ సర్పంచ్ అక్కల తిరుమల నాథ్, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ని ఉండవల్లి లోని తమ నివాసంలో కలిసి అతను చేసిన అభివృద్ధి పనులపై వినతి పత్రాన్ని అందజేశారు. అతని పని చేసిన సమయంలో ఉత్తమ అవార్డు రావడం జరిగిందన్నారు. కార్వేటినగరం మేజర్ పంచాయతీకి ప్రత్యేక నిధులు కేటాయించి అభివృద్ధి చేయాలన్నారు. పార్టీకి చేసిన అభివృద్ధి గురించి వివరించడంతో ఆయన అభినందించారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ విజయానికి కృషి చేయాలని సూచించారు.
